అయోధ్యతో పాటు హైదరాబాద్ నుంచి 7 కొత్త విమాన సేవలు

సెల్వి
శుక్రవారం, 27 సెప్టెంబరు 2024 (15:38 IST)
ఇండిగో ఎయిర్‌లైన్స్ అయోధ్యతో సహా ఏడు కొత్త నగరాలకు నేరుగా విమాన సర్వీసులను ప్రారంభిస్తోంది. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి కొత్త మార్గాలు హైదరాబాద్‌ను రాజ్‌కోట్, అగర్తల, జమ్మూ, ఆగ్రా, కాన్పూర్, అయోధ్య, ప్రయాగ్‌రాజ్‌లకు కలుపుతాయి.
 
ఈ విమానయాన సంస్థ సెప్టెంబర్ 28న అయోధ్యకు నేరుగా విమానాన్ని ప్రారంభించనుంది, సోమ, బుధ, శుక్ర, ఆదివారాల్లో వారానికి నాలుగు సార్లు నడుస్తుంది. 
 
జూన్ 1న స్పైస్‌జెట్ హైదరాబాద్ నుండి అయోధ్యకు తన డైరెక్ట్ విమానాలను నిలిపివేసిన తర్వాత మూడు నెలల విరామం తర్వాత ఈ కొత్త సర్వీస్ అందుబాటులోకి వచ్చింది.
 
హైదరాబాద్ - రాజ్‌కోట్ మధ్య రోజువారీ సర్వీస్ సెప్టెంబర్ 16న, హైదరాబాద్ - అగర్తల మధ్య వారానికి 4 రోజులు (సెప్టెంబర్ 23న), హైదరాబాద్ - జమ్మూ మధ్య వారానికి 3 రోజులు సెప్టెంబర్ 24న ప్రారంభించబడింది. వీటితో పాటు, శుక్రవారం నుండి హైదరాబాద్- కాన్పూర్ ఈ సేవలు ప్రారంభం అయ్యాయి.
 
హైదరాబాద్ నగరం నుంచి నెల రోజుల్లో 7 కొత్త సర్వీసులు ప్రారంభం కావడం పట్ల కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ కొత్త సర్వీసులు ఆయా నగరాల మధ్య ప్రయాణికుల డిమాండ్‌ను తీర్చగలవని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కొత్త సర్వీసులను ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Renu Desai: రేబిస్‌ టీకా వేయించుకున్న రేణు దేశాయ్.. వీడియో వైరల్

గురుదత్త గనిగ, రాజ్ బి. శెట్టి కాంబోలో జుగారి క్రాస్ టైటిల్ ప్రోమో

Shimbu: సామ్రాజ్యం తో శింబు బెస్ట్ గా తెరపైన ఎదగాలి : ఎన్టీఆర్

Ram Charan: పెద్ది తాజా అప్ డేట్.. శ్రీలంక వెళ్లనున్న రామ్‌చరణ్‌

Shivaji : శివాజీ, లయ కాంబినేషన్ లో పంచాయతీ సెక్రెటరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

తర్వాతి కథనం
Show comments