Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎస్బీఐ.. రూ.28 చెల్లిస్తే ఏకంగా రూ.4 లక్షల బెనిఫిట్ పొందొచ్చు

Webdunia
బుధవారం, 22 సెప్టెంబరు 2021 (10:28 IST)
దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ కస్టమర్లకు వివిధ రకాల సేవలని అందిస్తోంది. కేంద్ర ప్రభుత్వం అందించే పథకాల సర్వీసులు కూడా స్టేట్ బ్యాంక్ ఇచ్చే సేవల్లో వున్నాయి. స్టేట్ బ్యాంక్ కేంద్రం అందించే పలు స్కీమ్స్‌ను కస్టమర్స్ కోసం ఉంచడం జరిగింది. అయితే స్కీమ్స్‌లో రెండు స్కీమ్స్ చాలా ముఖ్యమైనవి. 
 
మీరు నెలకు రూ.28 చెల్లిస్తే ఏకంగా రూ.4 లక్షల బెనిఫిట్ పొందొచ్చు. అదే ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన PMJJBY స్కీమ్ నుండి. అలానే ప్రధాన్ మంత్రి సురక్ష బీమా యోజన PMSBY కూడా మంచి ప్రాఫిట్‌ని ఇచ్చే స్కీమ్. అయితే ఇవి రెండూ ఇన్సూరెన్స్ స్కీమ్స్. ఈ రెండు స్కీమ్స్‌లో చేరితే ఏడాదికి రూ.342 చెల్లిస్తే సరిపోతుంది.
 
సురక్ష బీమా యోజన కింద ఏడాదికి రూ.12 కట్టాలి. ఇక వీటి వలన కలిగే లాభాల గురించి చూస్తే.. యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కింద రూ.2 లక్షల వరకు కవరేజ్ లభిస్తుంది. అలాగే జీవన్ జ్యోతి బీమా యోజనకు ఏడాదికి రూ.330 చెల్లించాలి. 
 
దీని ద్వారా రూ.2 లక్షల జీవిత బీమా కవరేజ్ లభిస్తుంది. అయితే స్టేట్ బ్యాంక్‌లో అకౌంట్ ఉంటే ఈ లాభాలని పొందొచ్చు. అయితే మీరు ప్రతి సంవత్సరం మీ బ్యాంక్ అకౌంట్‌లో రూ.350 కలిగి ఉండాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఉస్తాద్ భగత్ సింగ్'లో రాశీఖన్నా... మేకర్స్ వెల్లడి

NTR: వార్ 2తో హృతిక్ రోషన్ తారక్ (ఎన్.టి.ఆర్.) 25 ఏళ్ళ వారసత్వం

Raashi Khanna: ఉస్తాద్‌ భగత్‌సింగ్ లో దేవదూత రాశిఖన్నా శ్లోకా గా ఎంట్రీ

పవన్ కళ్యాణ్ నిత్యం మండే స్ఫూర్తి : క్రిష్ జాగర్లమూడి

Bigg Boss 9 Telugu: సెట్లు సిద్ధం.. వీజే సన్నీ, మానస్, ప్రియాంక జైన్‌లు రీ ఎంట్రీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తర్వాతి కథనం
Show comments