దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థగా ఉన్న భారతీయ స్టేట్ బ్యాంకు తమ ఖాతాదారులకు శుభవార్త చెప్పింది. గృహరుణాలు తీసుకునేవారికి 6.7 శాతానికే రుణాలు ఇవ్వనున్నట్టు పేర్కొంది. అంతేకాదు ఎంత రుణం తీసుకున్నప్పటికీ ఇదే వడ్డీ రేటు వర్తిస్తుందని తెలిపింది. ఇలా ఒకే రేటుకు హోంలోన్లు ఇవ్వడం ఇదే తొలిసారి.
అంతేకాదు ప్రాసెసింగ్ ఫీజును కూడా మాఫీ చేసింది. దేశంలో పండుగల సీజన్‌కు ముందు ఇళ్లు కొనాలనుకుంటున్న వారిని ఆకర్షించడానికి ఎస్‌బీఐ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఇది ఎలా లబ్ధి చేకూర్చనుందో కూడా బ్యాంకు వివరించింది.
గతంలో ఉద్యోగులకు, ఉద్యోగేతరులకు వేర్వేరు వడ్డీ రేట్లు ఉండేవి. ఉద్యోగేతరులైతే ఎక్కువ వడ్డీ చెల్లించాల్సి వచ్చేది. ఈ తాజా నిర్ణయం వల్ల ఉద్యోగేతరులు కూడా తమ వడ్డీ రేటుపై 15 బేసిస్ పాయింట్లు ఆదా చేసుకోవచ్చు అని బ్యాంక్ చెప్పింది.