హారతి కర్పూరమైన అనిల్ అంబానీ ఆస్తి.. బిలియనీర్ ‌నుంచి మిలియనీర్‌కు...

Webdunia
మంగళవారం, 18 జూన్ 2019 (12:39 IST)
దేశంలో ఉన్న ప్రముఖ పారిశ్రామికవేత్తల్లో అనిల్ అంబానీ ఒకరు. అడాగ్ గ్రూప్  అధినేతగా, ఆర్‌కామ్ ఛైర్మన్‌‌గా ఉన్న ఈయన ఆస్తి ఇపుడు హారతి కర్పూరంలా తరిగిపోయింది. ఫలితంగా ఈయన ధనవంతుల జాబితా నుంచి స్థానం కోల్పోయారు. 
 
నిజానికి గత 2008లో ఫోర్బ్స్ జాబితా ప్రకటించిన జాబితాలో అనిల్ అంబానీ ఓ బిలియనీర్. ఆ సమయంలో ఈయన ఆస్తి విలువ 42 బిలియన్ డాలర్లుగా ఉండేది. అంటే.. ప్రపంచ బిలియనీర్ల జాబితాలో అనిల్ అంబానీది ఆరో స్థానమన్నమాట. కానీ దశాబ్దకాలం గడిచిపోయేసరికి ఆయన ఆస్తి కర్పూరంలా కరిగిపోయింది. ప్రస్తుతం అనిల్ అంబానీ మొత్తం ఆస్తి విలువ కేవలం రూ.3651 కోట్లు (523 మిలియన్ డాలర్లు) మాత్రమే. 
 
దీనికి ఆయన సారథ్యంలోని అనేక కంపెనీలు అప్పుల్లో కూరుకునిపోవడం ప్రధాన కారణం. ఫలితంగా ఆయా కంపెనీల షేర్ల ధరలు గణనీయంగా పడిపోయాయి. దీనికితోడు అప్పులు మాత్రం భారీగా పెరిగిపోయాయి. దీంతో ఆయన వ్యాపార సామ్రాజ్యం విలువ పాతాళానికి చేరిపోయింది. 
 
మ్యూచుఫల్‌ ఫండ్‌ జాయింట్‌ వెంచర్‌ అయిన, రిలయన్స్‌ - నిప్సాన్‌ లైఫ్‌ అసెట్‌ మేనేజ్‌‌మెంట్‌‌లోని తమ 43 శాతం వాటాలను విక్రయించాలని బ్యాంకులు నిర్ణయించుకోవడం, గడచిన 14 నెలల కాలంలో రూ.35 వేల కోట్లకు పైగా రుణాలను తీర్చడంతోనే అనిల్ అంబానీ ఆస్తి హారతికర్పూరమైందని ఆర్థిక రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Malavika Nair: శర్వా.. బైకర్ ఫస్ట్ ల్యాప్ గ్లింప్స్ థియేటర్లలో స్క్రీనింగ్

Thaman: బాలకృష్ణ.. అఖండ 2: తాండవం బ్యాగ్రౌండ్ స్కోర్ కోసం సర్వేపల్లి సిస్టర్స్

Dulquer : దుల్కర్ సల్మాన్.. కాంత నుంచి రాప్ ఆంథమ్ రేజ్ ఆఫ్ కాంత రిలీజ్

Rashmika: ది గర్ల్ ఫ్రెండ్ లో రశ్మికను రియలిస్టిక్ గా చూపించా : రాహుల్ రవీంద్రన్

Bhumi Shetty: ప్రశాంత్ వర్మ కాన్సెప్ట్ తో రాబోతున్న మహాకాళి చిత్రంలో భూమి శెట్టి లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

తర్వాతి కథనం
Show comments