కరెన్సీ నోటు కాదు దోరగా వేయించిన దోశె.. నెటిజన్స్ కామెంట్స్

భారత రిజర్వు బ్యాంకు వినాయకచవితి పర్వదినాన్ని పురస్కరించుకొని కొత్త రూ.200, రూ.50 కరెన్సీ నోట్లను శుక్రవారం నుంచి చెలామణిలోకి తెచ్చింది. కొత్త రూ.200 రూపాయాల నోటు కోసం ఏటీఎం కేంద్రాల వద్ద బ్యాంకు ఖాతా

Webdunia
శుక్రవారం, 25 ఆగస్టు 2017 (16:29 IST)
భారత రిజర్వు బ్యాంకు వినాయకచవితి పర్వదినాన్ని పురస్కరించుకొని కొత్త రూ.200, రూ.50 కరెన్సీ నోట్లను శుక్రవారం నుంచి చెలామణిలోకి తెచ్చింది. కొత్త రూ.200 రూపాయాల నోటు కోసం ఏటీఎం కేంద్రాల వద్ద బ్యాంకు ఖాతాదారులు క్యూ కట్టారు. కొత్త నోటును చేజిక్కించుకునేందుకు పోటీ పడ్డారు. రూ.50, రూ.200 నోట్ల కోసం ఎగబడ్డారు. రూ.200 రూపాయల డినామినేషన్ కరెన్సీ నోట్లను ఆర్బీఐ ప్రవేశపెట్టడం దేశంలోనే ఇది తొలిసారి. అయితే కొత్త నోట్లు ఏటీఎంల ద్వారా చలామణిలోకి రావడానికి మరికొంత సమయం పడుతుంది.
 
అయితే, ఈ నోటు రంగుపై నెటిజన్లు పలు రకాలైన కామెంట్స్ చేస్తున్నారు. కాషాయ రంగులో ఉన్న ఈ నోటు దోరగా వేయించిన దోశను తలపిస్తుందని, బాగా మరగబెట్టిన ఇరానీ చాయ్ రంగులో ఉందని సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. నోటును వినాయక చవితి రోజు విడుదల చేయడాన్ని ప్రస్తావిస్తూ ఇక్కడ కూడా ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం హిందుత్వాన్ని చూపిస్తుందని విమర్శిస్తున్నారు. ఇప్పటికి వరకు విడుదల చేసిన రూ.2000, రూ.500, రూ.200, రూ.50 నోట్లన్నీ అమ్మాయిలకు బాగా ఇష్టమైన రంగుల్లోనే ఉన్నాయన్నారు. మరి అబ్బాయిలకోసం నోట్లు ప్రచురించరా? అని మరికొంత మంది ప్రశ్నిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akanda 2: ఏ సౌండ్ కు నవ్వుతానో.. నరుకుతానో నాకే తెలియదు అంటున్న బాలక్రిష్ణ

చెవిటి, మూగ అమ్మాయి ని ప్రేమించే యువకుడి గాథతో మోగ్లీ

Ram Charan : పెద్ది షూటింగ్ కోసం శ్రీలంకకు బయలుదేరిన రామ్ చరణ్

Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఆహ్వానించిన నారా రోహిత్

Heba Patel: పోస్ట్ ప్రొడక్షన్ ల్లో అనిరుధ్, హెబా పటేల్ మారియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

తర్వాతి కథనం
Show comments