Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రూ.200 నోటు కోసం ఏటీఎం కేంద్రాలకు వెళ్లొద్దు.. ఎందుకంటే?

భారత రిజర్వు బ్యాంకు తొలిసారి 200 రూపాయిల నోటును శుక్రవారం నుంచి చెలామణిలోకి తెచ్చింది. ఈ విషయాన్ని ఆర్బీఐ అధికారికంగా ప్రకటించింది. చూసేందుకు చాలా అందంగా కనిపిస్తున్న ఈ నోటు కోసం ప్రతి ఒక్కరూ ఏటీఎం క

రూ.200 నోటు కోసం ఏటీఎం కేంద్రాలకు వెళ్లొద్దు.. ఎందుకంటే?
, శుక్రవారం, 25 ఆగస్టు 2017 (16:18 IST)
భారత రిజర్వు బ్యాంకు తొలిసారి 200 రూపాయిల నోటును శుక్రవారం నుంచి చెలామణిలోకి తెచ్చింది. ఈ విషయాన్ని ఆర్బీఐ అధికారికంగా ప్రకటించింది. చూసేందుకు చాలా అందంగా కనిపిస్తున్న ఈ నోటు కోసం ప్రతి ఒక్కరూ ఏటీఎం కేంద్రాలకు వెళుతున్నారు. అలా వెళ్లిన వారికి తీవ్ర నిరాశే ఎదురవుతోంది. ఎందుకంటే... 
 
ఏటీఎంల‌లో మీకు రూ.200 నోటు రాదు. ఎందుకంటే... ఆ నోటు‌ను స్కాన్ చేసే సాఫ్ట్‌వేర్ ఏటీఎంల‌లో అందుబాటులో లేదు. గ‌త సంవ‌త్స‌రం న‌వంబ‌ర్ 8వ తేదీన దేశ ప్ర‌ధాని నరేంద్ర మోడీ పెద్ద నోట్లు రూ.500, రూ.1000 నోట్ల‌ను ర‌ద్దు చేసిన త‌ర్వాత కొత్త‌గా రూ.500, రూ.2000 నోట్ల‌ను తీసుకొచ్చారు అయితే.. కొత్త నోట్లు వ‌చ్చినా.. వాటిని గుర్తించే సాఫ్ట్‌వేర్ ఏటీఎంల‌లో లేక‌పోవ‌డంతో ప్ర‌జ‌లు డ‌బ్బుల కోసం దేశ ప్రజలంతా తల్లడిల్లిపోయారు. 
 
ఇక‌.. ఇప్పుడు కూడా సేమ్ సీన్‌ రిపీట్ అవుతున్న‌ది. రూ.200 చ‌లామ‌ణిలోకి వ‌చ్చినా.. బ్యాంకులకు వెళ్లి తీసుకోవాల్సిందే త‌ప్ప‌... ఇప్ప‌టికిప్పుడు ఏటీఎంల‌లో మాత్రం క‌నిపించ‌వు. ఈ ప్రాసెస్ అంతా పూర్త‌వ్వ‌డానికి క‌న్సికం ఓ నెల రోజులైనా ప‌డుతుంద‌ట‌. అద్గదీ సంగతి. సో.. కొత్త రూ.200 నోటును ఏటీఎం‌లో చూడాలంటే నెల ఎదురు చూడాలి. లేదంటే బ్యాంకుల‌కెళ్లి తెచ్చుకోవాల్సిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రేప్ కేసులో గుర్మీత్ సింగ్ దోషి.... వివాదాస్పద బాబా పేరున 19 గిన్నిస్ రికార్డులు