Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాత్రిపూట రైళ్లల్లో ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్‌లకు ఛార్జింగ్ పెట్టలేం..!

Webdunia
మంగళవారం, 30 మార్చి 2021 (21:52 IST)
రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణీకుల భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని పేర్కొంది. ఇందులో భాగంగా రైల్వే ప్రయాణికులు రాత్రివేళల్లో రైలు కోచ్‌లలో ఛార్జింగ్‌ పాయింట్లను ఇకపై ఉపయోగించలేరని వెల్లడించింది. 
 
అగ్ని ప్రమాదాలను నివారించడంలో భాగంగా రాత్రి సమయంలో ఛార్జింగ్‌ పాయింట్ల వాడకంపై నిషేధం విధించింది. ఇటీవల ఢిల్లీ-డెహ్రాడూన్‌ శతాబ్ధి ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఒక కోచ్‌లో మొదలైన మంటలు ఏడు బోగీలకు వ్యాపించాయి.
 
ప్రయాణీకుల భద్రతను దృష్టిలో ఉంచుకుని రైళ్లలో ఛార్జింగ్ పాయింట్లను రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు స్విచ్ ఆఫ్ చేయాలని రైల్వే నిర్ణయించినట్లు వెస్ట్రన్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ సుమిత్ ఠాకూర్ తెలిపారు. 
 
ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్‌లు రాత్రిపూట ఛార్జింగ్‌ పెట్టే క్రమంలో కొన్నిసార్లు అవి వేడెక్కడం వల్ల సుదూర ప్రాంతాలకు వెళ్లే రైళ్లలో మంటలు సంభవిస్తున్నాయి. దీంతో ఇతర రైల్వే జోన్లలో కూడా ఈ నిబంధనలను అమలు చేస్తున్నట్లు ఠాకూర్ చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏడాది క్రితం ట్వీట్స్ పెడితే ఇప్పుడు మనోభావాలు దెబ్బతినడం ఏంటి: వర్మ లాజిక్

నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్ నుంచి క్వీన్ విద్యా వోక్స్ పాడిన సాంగ్ రిలీజ్

తల్లి మనసు సినిమాకు సెన్సార్ సభ్యుల ప్రశంసలు

అఖిల్ అక్కినేని, జైనాబ్ రావ్‌జీల నిశ్చితార్థం చేశామన్న నాగార్జున

రోటి కపడా రొమాన్స్‌ బాగా లేదంటే సినిమాలకు రిటైర్‌మెంట్‌ : దర్శకుడు విక్రమ్‌ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments