Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ రైలులో ప్రయాణికులు ఉచితంగా సినిమాలు చూడవచ్చు...

Webdunia
గురువారం, 14 ఫిబ్రవరి 2019 (15:19 IST)
భారతీయ రైల్వే శాఖ ఇప్పటికే వేలాది రైల్వే స్టేషన్‌లలో ఉచిత వైఫై సౌకర్యాలను ప్రయాణికులకు కల్పించింది. తాజాగా ఒక అడుగు ముందుకు వేసి రైళ్లలో ప్రయాణించేటప్పుడు సైతం ఈ సౌకర్యాన్ని కల్పించనుంది. కాచిగూడ-కేఎస్ఆర్ బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించే వారు వైఫై సాయంతో తమ ప్రయాణంలో నిరంతరాయంగా సినిమాలు చూడవచ్చు. 
 
ప్రధాని నరేంద్ర మోదీ డిజిటల్ ఇండియా మిషన్ కార్యక్రమంలో భాగంగా దక్షిణ మధ్య రైల్వే కొత్తగా మేజిక్ బాక్స్‌ను ప్రవేశపెట్టింది. శతాబ్ది, ముంబై రాజధాని ఎక్స్‌ప్రెస్, లక్నో ఎక్స్‌ప్రెస్‌లలో మాదిరిగానే వైఫై ఎన్‌ఫోటెయిన్‌మెంట్ సిస్టమ్ సాయంతో ప్రయాణికులు తమ పర్సనల్ డివైజ్‌లలో ఉచితంగా సినిమాలను వీక్షించవచ్చని రైల్వే అధికారులు ప్రకటించారు. 
 
ఈ ఉచిత వైఫైను కాచిగూడ- కేఎస్ఆర్ బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌లోని ఐదు ఏసీ బోగీల్లో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టారు. కాగా ఈ మేజిక్ బాక్స్ నుండి సినిమాలను డౌన్‌లోడ్ చేసుకునే వీలు లేదు. అభ్యంతరకరమైన దృశ్యాలను ప్రయాణికులు చూడకుండా ఉండటంతో పాటుగా ఉచిత వైఫైని దుర్వినియోగం చేయకుండా ఉండేందుకు రైల్వే అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

తర్వాతి కథనం
Show comments