దసరా రద్దీ : ప్రత్యేకం పేరుతో భారీ వడ్డన - రైల్వే మాయ

Webdunia
శనివారం, 9 అక్టోబరు 2021 (07:52 IST)
రైల్వే శాఖ ప్రయాణికులపై అమితంగా భారీ మోపుతోంది. దసరా రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకం పేరుతో భారీగా ప్రయాణ చార్జీలను వసూలుకు శ్రీకారం చుట్టుంది. ప్రత్యేక రైళ్లు, తత్కాల్ పేరుతో ప్రయాణికులు భరించలేనంతగా చార్జీలు వసూలు చేస్తోంది. 
 
రైల్వే తాజా నిర్ణయంతో రైలు, ప్రయాణం చేసే క్లాస్‌ను బట్టి ఒక్కో ప్రయాణికుడిపై అదనంగా రూ.200 నుంచి రూ.700 వరకు భారం పడుతోంది. దసరా పండుగ నేపథ్యంలో హైదరాబాద్‌లో ఉంటున్న ఏపీ, బీహార్, పశ్చిమ బెంగాల్, ఒడిశా తదితర రాష్ట్రాలకు చెందిన కార్మికులు, ఉద్యోగులు సొంత రాష్ట్రాలకు పయనమవుతున్నారు. 
 
దీంతో అనూహ్యంగా పెరిగిన రద్దీని తట్టుకునేందుకు రైల్వే ప్రత్యేక రైళ్లు ప్రకటించింది. ఈ రైళ్ల టికెట్లన్నీ హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. ఈ నెల 14న హైదరాబాద్ - విశాఖపట్టణం గరీభ్‌ రథ్ రైలు టికెట్లన్నీ కొన్ని గంటల్లోనే అమ్ముడుపోగా, 142 మంది ఇంకా వెయిటింగ్ లిస్టులో ఉన్నారు. అదే రోజు హైదరాబాద్ నుంచి ఖమ్మం వైపు 16 రైళ్లు వెళ్లనుండగా రెండు, మూడు మినహా అన్నింటిలోనూ టికెట్లు అయిపోయాయి. ఈ రైళ్లలో టిక్కెట్లన్నీ ప్రత్యేకం పేరుతో భారీ ధరకు అమ్ముకోవడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆర్టిస్టుల సమస్యలను దాటి తెరకెక్కిన పండంటి కాపురం ఒక తెలుగు క్లాసిక్

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇంట్లో దీపావళి పార్టీ కారణం అదే..

Pawan Kalyan: పవన్ కల్యాణ్ సినిమా ప్రయాణం ఇంకా ముగియలేదా? నెక్ట్స్ సినిమా ఎవరితో?

K Ramp: కొందరు కావాలనే K-ర్యాంప్ మూవీపై పక్షపాతం చూపిస్తున్నారు : నిర్మాత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments