Webdunia - Bharat's app for daily news and videos

Install App

విద్యుత్ రంగంలోనూ పోర్టబులిటీ.. త్వరలోనే అమలులోకి వస్తుందా?

Webdunia
మంగళవారం, 16 మార్చి 2021 (16:54 IST)
Electricity
మొబైల్‌ ఫోన్లను వాడుతున్న వినియోగదారులందరికీ పోర్టబులిటీ గురించి బాగా తెలుసు. ఒక టెలికాం కంపెనీకి చెందిన నెట్‌వర్క్‌, దాని సేవలు నచ్చకపోతే ఇంకో నెట్‌వర్క్‌ లోకి మారవచ్చు. పోర్టింగ్‌ విధానంలో ఈ విధంగా ఒక నెట్‌వర్క్‌ నుంచి మరో నెట్‌వర్క్‌కు మన ఫోన్‌ నంబర్‌ను మార్చుకునేందుకు అవకాశం ఉంటుంది. అయితే ఇదే విధానాన్ని త్వరలో విద్యుత్‌ రంగంలోనూ అందివ్వనున్నారు. విద్యుత్ రంగంలోనూ పోర్టబులిటీ విధానం అమలులోకి వచ్చే ఛాన్సుందని టాక్. 
 
ఇకపై విద్యుత్‌ వినియోగదారులు తాము వాడుతున్న విద్యుత్‌ను అందిస్తున్న కంపెనీ సేవలు నచ్చకపోతే ఇంకో కంపెనీకి మారవచ్చు. త్వరలోనే ఇందులోనూ పోర్టింగ్‌ విధానాన్ని అమలు చేయనున్నారు. ఈ మేరకు కొత్త విద్యుత్‌ చట్టాన్ని రూపొందించారు. ఆ చట్టానికి చెందిన డ్రాఫ్ట్‌ బిల్లును అనుమతి కోసం కేబినెట్‌ ఎదుట ఉంచారు. కేబినెట్‌ నుంచి అనుమతి లభించిన తరువాయి ఆ బిల్లును ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్‌ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నారు. దీంతో బిల్లుకు ఆమోదం లభించనుంది.
 
కొత్త బిల్లు అమలులోకి వస్తే వినియోగదారులు తాము వాడుతున్న విద్యుత్‌ కంపెనీని మార్చవచ్చు. అయితే ప్రస్తుతానికి కేవలం కొన్ని విద్యుత్‌ కంపెనీలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. కనుక విద్యుత్‌ రంగంలో పోర్టింగ్‌ను మరింత సమర్థవంతంగా అమలు చేయాలంటే అందులో కొత్త కంపెనీలు రావాలి. అందుకనే కొత్త కంపెనీల ఏర్పాటుకు కూడా కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. 
 
దాని ప్రకారం ఎవరైనా సరే విద్యుత్‌ కంపెనీలను ఏర్పాటు చేయవచ్చు. దీంతో కంపెనీల మధ్య పోటీ ఉంటుంది. అది వినియోగదారులకు మేలు చేస్తుంది. వారు తమకు నచ్చిన కంపెనీకి మారి విద్యుత్‌ను పొందవచ్చు. దీంతో విద్యుత్‌ రంగంపై కంపెనీల నియంత్రణ తగ్గుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venkatesh: విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమా మొదలు

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

పెంచల్ రెడ్డి జీవిత కథతో ఆపద్భాంధవుడు చిత్రం: భీమగాని సుధాకర్ గౌడ్

Chiranjeevi: చిరంజీవితో విశ్వంభర లో సత్యలోకం చూపిస్తున్న వసిష్ఠ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments