Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాత్రికి రాత్రి దుకాణం కట్టేసి లేచిపోవడానికి ప్లాన్ : వైకాపా రెబెల్ ఎంపీ

Webdunia
మంగళవారం, 16 మార్చి 2021 (16:34 IST)
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఆ రాష్ట్ర ప్రభుత్వంపై అధికార వైకాపాకు చెందిన రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు మరోమారు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలను సాకుగా చూపి రాత్రిరాత్రే దుకాణం సర్దేయడానికి సీఎం జగన్ సిద్ధమవుతున్నారని ఆయన ఆరోపించారు.
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ప్రజలు తీర్పు ఇచ్చారని... ఇక్కడ రాజధాని వద్దంటున్నారని కోర్టుకు తమ ప్రభుత్వం చెప్పనుందన్నారు. ఓ మహానుభావుడు ముహూర్తం పెట్టారట... మూటాముళ్లే సర్దుకుని ఆయన వెళ్లిపోతారట. అధికారుల పిల్లలకు స్కూళ్లు, కాలేజీలు, ఇళ్లపై పలు సూచనలు చేశారట. ఈ అప్రతిహత విజయాన్నిసాకుగా చూపి... ఇక్కడి నుంచి రాత్రికి రాత్రి దుకాణం కట్టేసి లేచిపోదామని అనుకుంటున్నారు అని వ్యాఖ్యానించారు.
 
అంతేకాకుండా, మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం రాత్రికి రాత్రే లేచిపోవడానికి ప్లాన్ చేస్తున్నారు. లీగల్‌గా ఇది చెల్లదు. వందలాది సలహాదారులు మీకు సలహా ఇవ్వడం లేదా? 20 సార్లు ముహూర్తం పెట్టారు. మధ్యలోనే ఆగిపోయాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ సచివాలయం అనేది ఇక్కడే ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sukku: తన భార్యతో వింబుల్డన్ 2025 ఫైనల్స్‌కు హాజరయిన తబిత బండ్రెడ్డి

బిగ్ బాస్ 19లో క్రికెటర్ మాజీ భార్య.. హైదరాబాద్ నుంచి ఇద్దరు!!

హీరో రవితేజ ఇంట్లో విషాదం.. ఏంటది?

ఎపుడు కూడా పుకార్లను నమ్మొద్దు.. పవన్ హీరోయిన్ వినతి

Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యాన్స్ హరిహరవీరమల్లు కు మద్దతు ఇవ్వరా ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

తర్వాతి కథనం
Show comments