Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోస్టాఫీసుల్లో వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్.. స్లాట్ బుకింగ్స్ ఇక ఈజీ!

Webdunia
సోమవారం, 31 మే 2021 (10:34 IST)
దేశ వ్యాప్తంగా అలాగే తెలుగు రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోంది. అయితే..ప్రజలు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రిజిస్ట్రేషన్ సమయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇందుకు స్మార్ట్ ఫోన్ కంపల్సరీగా ఉపయోగించాల్సి ఉంటుంది.

అయితే ఇకపై ఇలాంటి ఇబ్బందులు అవసరం లేదని అధికారులు అంటున్నారు. సమీపంలో ఉన్న పోస్టాఫీస్‌కు వెళితే సరిపోతుందని చెప్తున్నారు. టీకా రిజిస్ట్రేషన్ ప్రక్రియ, స్లాట్ బుకింగ్ చేసుకొనే వారికి సహకరించాలని తాజాగా..పోస్టాఫీస్ శాఖాధికారులు నిర్ణయించారు. ఇందుకు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేస్తున్నారు.
 
ప్రస్తుతం కరోనా టీకా తీసుకోవాల్సి ఉంటే.. కొవిన్ పోర్టులో కు వెళ్లి అక్కడ రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇకపై పోస్టాఫీసుల్లో వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్, స్లాట్ బుకింగ్ సేవలను కేంద్రం అనుమతించింది. దీనిని ప్రధాన మంత్రి నియోజకవర్గం వారణాసిలో దీనిని ప్రారంభించారు. అనంతరం దేశ వ్యాప్తంగా ఉన్న పోస్టాఫీసులకు విస్తరించారు. తెలంగాణ రాష్ట్రంలోని 36 హెడ్ పోస్టాఫీసులు, 643 సబ్ హెడ్ పోస్టాఫీసులు, 810 బ్రాంచ్ పోస్టాఫీసుల్లో 2021, మే 31వ తేదీ సోమవారం నుంచి ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పనిచేయనున్నాయి. 
 
కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాల్సిన వారు…తమ సమీప పోస్టాఫీసు కు వెళ్లాల్సి ఉంటుంది. ఆధార్ కార్డు, ఫోన్ తీసుకెళ్లాలి. దానికి వచ్చే OTPని నమోదు చేయడం ద్వారా రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది. ఇక పోస్టాఫీసుకు వచ్చే వారు ఖచ్చితంగా కోవిడ్ నిబంధనలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

డల్ గా వుంటే మ్యాడ్ లాంటి సినిమా చూడమని డాక్టర్లు కూడా చెప్పాలి : నాగచైతన్య

నరేష్ అగస్త్య కొత్త చిత్రం మేఘాలు చెప్పిన ప్రేమ కథ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

Coconut Oil: మహిళలూ రాత్రిపూట కొబ్బరినూనెను ముఖానికి రాసుకుంటే?

తర్వాతి కథనం
Show comments