దసరా పండగ పూట వంటిల్లో ధరల మంట

Webdunia
బుధవారం, 13 అక్టోబరు 2021 (09:36 IST)
దేశంలో ఒకపైవు పెట్రోల్, డీజల్ ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. మరోవైపు, గ్యాస్ వినియోగదారులకు ఆయిల్ కంపెనీలు షాకిచ్చాయి. దసరా పండుగ ముందు వంట గ్యాస్ మంటపెట్టారు. గ్యాస్ సిలిండర్ ధర మరోసారి పెంచేశారు. 
 
14.2 కేజీల సాధారణ వంటగ్యాస్ సిలిండర్ ధరను రూ.15 పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఢిల్లీలో సిలిండర్ ధర రూ.899.50కు చేరింది. పెరిగిన ధరలు బుధవారం నుంచే అమల్లోకి రానుంది. దీంతో గ్యాస్ సిలిండర్ వాడే వారిపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడింది. 
 
ఢిల్లీలో సబ్సిడీ లేకుండా 14.2 కిలోల సిలిండర్ ధర ఇప్పుడు రూ.899.50కి పెరిగింది. కోల్‌కతాలో ఎల్పీజీ సిలిండర్ ధర రూ.911 నుంచి రూ.926కి, ముంబైలో రూ.844.50 నుండి రూ.899.50కి పెరిగింది. చెన్నైలో సబ్సిడీయేతర సిలిండర్ ధర ఇప్పుడు రూ.915.50. 
 
ఢిల్లీలో 19 కిలోల వాణిజ్య గ్యాస్ ధర రూ.1736.5. కోల్‌కతాలో వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర రూ.1805.5. ముంబైలో రూ.1685, చెన్నైలో రూ.1867.50గా ఉంది. సహజ వాయువు ధరల పెరుగుదల కారణంగా సీఎన్జీ, జీఎన్జీ వంట గ్యాస్ ధరలు పెరిగాయి. 
 
ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ (ఐజిఎల్) ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో సిఎన్‌జి ధరను కిలోకు రూ.2.55 వరకు పెంచింది. అదే సమయంలో పీఎన్జీ ద్వారా ధర క్యూబిక్ మీటర్‌కు రూ.2.10 పెరిగింది.
 
మంగళవారం మహానగర్ గ్యాస్ లిమిటెడ్ తక్షణం అమలులోకి వచ్చేలా సీన్జీజీ, పీఎన్జీ రిటైల్ ధరను కిలోకు రూ.2 పెంచింది. ముంబైలో అన్ని పన్నులతో కలిపి సీఎన్జీ ఇప్పుడు కేజీకి రూ.54.57గా ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సుడిగాలి సుధీర్ గోట్ దర్శకుడుపై నటి దివ్యభారతి ఆరోపణ

Priyadarshi: నాకేం స్టైల్ లేదు, కొత్తగా చేస్తేనే అది మన స్టైల్ : ప్రియదర్శి

అఖిల్ మరో దేవరకొండ.. తేజస్వినీలో సాయి పల్లవి కనిపించింది : వేణు ఊడుగుల

Allari Naresh: హీరోయిన్ పై దోమలు పగబట్టాయి : అల్లరి నరేశ్

నిర్మాతగా స్థాయిని పెంచే చిత్రం మఫ్టీ పోలీస్ : ఎ. ఎన్. బాలాజి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments