దేశంలో పెట్రోల్, డీజల్ ధరల పెరుగుదలకు ఇప్పట్లో అడ్డుకట్ట పడేలా కనిపించడం లేదు. వరుసగా నాలుగో రోజు కూడా పెట్రోల్ ధరల్లో పెరుగుదల కనిపించింది. మంగళవారం నుంచి ప్రతిరోజూ పెట్రో ధరలు పెంచుతూ సామాన్యుడి నడ్డి విరుస్తున్న చమురు మార్కెటింగ్ కంపెనీలు.. మరోసారి లీటరు పెట్రోలుపై 30 పైసలు, డీజిల్‌పై 35 పైసల చొప్పున వడ్డించాయి.
దీంతో ఢిల్లీలో పెట్రోల్, డీజిల్ ధరలు సరికొత్త రికార్డు స్థాయికి చేరాయి. దేశ రాజధానిలో లీటరు పెట్రోల్ ధర రూ.103.54కు చేరగా, డీజిల్ ధర 92.17కు పెరిగింది. ఇక ముంబైలో పెట్రోల్ రూ.109.54, డీజిల్ రూ.99.22, చెన్నైలో పెట్రోల్ 101.01, డీజిల్ 96.60, కోల్‌కతాలో పెట్రోల్ రూ.104.23, డీజిల్ రూ.95.23కు చేరాయి.
ఇక హైదరాబాద్‌లో పెట్రోలుపై 31 పైసలు, డీజిల్‌పై 38 పైసల చొప్పున పెరిగాయి. దీంతో లీటరు డీజిల్ రూ.100.51కి చేరుకోగా, లీటరు పెట్రోలు రూ.107.73కు పెరిగింది. గురువారం నాటి పెంపుతో రాష్ట్రంలో డీజిల్ ధర రూ.వంద మార్కును దాటిని విషయం తెలిసిందే.