దేశంలో పెట్రోల్, డీజల్ ధరలతో పాటు.. వంట గ్యాస్ ధర కూడా పెరిగిపోతోంది. ఇప్పటికే చమురు ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఇపుడు వంట గ్యాస్ ధర కూడా అదే స్థాయిలో పెరుగుతూ వస్తోంది. తాజాగా మరోమారు వంట గ్యాస్ ధర పెరిగింది.
14.2 కేజీల సాధారణ వంటగ్యాస్ సిలిండర్ ధరను రూ.15 పెంచుతూ ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో ఢిల్లీలో సిలిండర్ ధర రూ.900కు చేరింది. పెరిగిన ధరలు బుధవారం నుంచే అమల్లోకి వచ్చాయి. దీంతో గ్యాస్ సిలిండర్ వాడే వారిపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడింది.