Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెరుగుతున్న పెట్రోల్ ధరలు- ఆల్ టైమ్ రికార్డ్.. సామాన్యుడికి చుక్కలు

పెరుగుతున్న పెట్రోల్ ధరలు సామాన్యునికి చుక్కలు చూపిస్తున్నాయి. పెట్రోల్ ధరలు రోజు రోజుకు ఆకాశాన్ని అంటుతున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో పెరుగుతున్న క్రూడాయిల్ ధరల వల్లే పెట్రో ఉత్పత్తుల ధరలు పెరుగుతున్నా

Webdunia
ఆదివారం, 16 సెప్టెంబరు 2018 (11:56 IST)
పెరుగుతున్న పెట్రోల్ ధరలు సామాన్యునికి చుక్కలు చూపిస్తున్నాయి. పెట్రోల్ ధరలు రోజు రోజుకు ఆకాశాన్ని అంటుతున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో పెరుగుతున్న క్రూడాయిల్ ధరల వల్లే పెట్రో ఉత్పత్తుల ధరలు పెరుగుతున్నాయని కేంద్రం ప్రకటించింది.


ప్రస్తుతం బ్రెంట్ క్రూడాయిల్ ధర 78 డాలర్ల వద్ద కొనసాగుతోంది. డాలర్‌తో రూపాయి మారకపు విలువలో బలహీన పడటం కూడా ఈ ధరల పెరుగుదలకు సహకరిస్తోందని ఆర్థిక విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 
 
తాజాగా పెట్రోలు ధర ఆదివారం సరికొత్త ఆల్ టైమ్ రికార్డుకు చేరుకుంది. ఆదివారం పెట్రోలు, డీజిల్ ధరలను పెంచుతున్నట్టు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రకటించింది. దేశ రాజధాని న్యూఢిల్లీలో పెట్రోలు ధర లీటరుకు రూ. 81.91కి, డీజిల్ ధర రూ. 73.72కు పెరిగింది.

ముంబయిలో పెట్రోలు ధర ఏకంగా రూ. 89.29కి చేరగా, డీజిల్ ధర రూ. 78.26కు చేరింది. దీంతో దేశ చరిత్రలో పెట్రోలు ధర రూ. 89ని దాటి ముందుకెళ్లడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. తద్వారా పెట్రోల్ ధర సరికొత్త రికార్డును చేరుకున్నట్లైంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా ఇండస్ట్రీ ఆంధ్రకు రాదు: పవన్ కళ్యాణ్

Rajinikanth: రజనీకాంత్ కూలీ సిద్ధమవుతోంది - ఓటీటీ కన్ ఫామ్స్

గాలి కిరీటీరెడ్డి జూనియర్ చిత్రానికి మిగిలింది రెండు రోజులే

హాట్ కేకుల్లా 'వీరమల్లు' : బుక్‌ మై షో క్రాష్? - ఆంధ్రాలో రూ.1000 - తెలంగాణాలో టిక్కెట్ ధర రూ.600

ZEE5 లో ఆడియెన్స్‌ను అల‌రిస్తూ దూసుకెళ్తోన్న భైర‌వం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తర్వాతి కథనం
Show comments