Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీలంకలో నానాటికీ పెరిగిపోతున్న పెట్రోల్ డీజిల్ ధరలు

Webdunia
ఆదివారం, 26 జూన్ 2022 (13:45 IST)
శ్రీలంక దేశంలో ఆర్థిక సంక్షోభం మరింతగా ముదిరిపోతోంది. ఈ కారణంగా ఆ దేశ ప్రజలు అన్నిరకాలుగా నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఇపుడు పెట్రోల్, డీజల్ ధరలు కూడా ఆకాశానికి ఎగబాకాయి. తాజాగా లీటరు పెట్రోల్, డీజల్ ధరలు అమాంతం పెరిగిపోయాయి. 
 
తాజాగా, పెట్రోలుపై రూ.50, డీజిల్‌పై రూ.60 పెంచారు. ఈ ధ‌ర‌లు ఆదివారం మ‌ధ్యాహ్నం 2 గంట‌ల నుంచి అమ‌ల్లోకి రానున్నాయని శ్రీ‌లంక ప్ర‌భుత్వ రంగ సంస్థ సిలోన్ పెట్రోలియం కార్పొరేష‌న్ (సీపీసీ) తెలిపింది. దీంతో శ్రీ‌లంక‌లో లీట‌రు పెట్రోలు ధ‌ర రూ.470, డీజిల్ ధ‌ర రూ.460కి పెరిగింది. శ్రీ‌లంక‌లో పెట్రోలు, డీజిల్ ధ‌ర‌ల‌ను పెంచ‌డం రెండు నెల‌ల్లో ఇది మూడ‌వ‌సారి.
 
చివ‌రిసారిగా మే 24న పెట్రోలుపై 24 శాతం, డీజిల్‌పై 38 శాతం ధ‌ర‌లు పెంచారు. ఇంధ‌నాన్ని తీసుకొచ్చే నౌక‌లు బ్యాంకింగ్‌తో పాటు ఇత‌ర కారణాల వ‌ల్ల ఆల‌స్యంగా వ‌స్తున్నాయ‌ని సీపీసీ తెలిపింది. వ‌చ్చేవారం బంకుల్లో పెట్రోల్‌, డీజిల్ ప‌రిమితంగా ఉంటుంద‌ని పేర్కొంది. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments