మరికాస్త తగ్గిన పెట్రోల్ డీజిల్ ధరలు

Webdunia
మంగళవారం, 24 ఆగస్టు 2021 (09:40 IST)
దేశంలో చమురు ధరలు మంగళవారం మరికాస్త తగ్గాయి. లీటర్‌ పెట్రోల్‌పై 15 పైసలు, డీజిల్‌పై 15 పైసలు చొప్పున తగ్గింది. దాదాపు 35 రోజుల తర్వాత రెండు రోజుల కిందట పెట్రోల్‌ 20 పైసలు తగ్గిన విషయం తెలిసిందే. 
 
ఇదిలావుంటే, ఏడాది మే, జూలై మధ్య లీటర్‌ పెట్రోల్‌పై చమురు కంపెనీలు రూ.11.52 వరకు బాదాయి మార్చి, ఏప్రిల్‌లు తమిళనాడు, బెంగాల్‌ సహా ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ధరల్లో ఎలాంటి మార్పులు కనిపించలేదు. మే 4 ఫలితాలు వెలువడిన తర్వాత పెట్రోల్ ధరల బాదుడు మొదలైంది. 
 
ఏకంగా 42 రోజుల పాటు ధరలను పెంచారు. ఫలితంగా లీటర్‌పై రూ.11.52, డీజిల్‌పై 41 రోజుల్లో లీటర్‌పై 9.08 చొప్పున పెంచేశాయి. అయితే, కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రిగా హర్దీప్‌ సింగ్‌ పూరి బాధ్యతలు స్వీకరించిన అనంతరం ధరలు జూలై 18 నుంచి స్థిరంగా కొనసాగుతూ వచ్చాయి. ఈ నెల 22న పెట్రోల్‌ ధరపై 20 పైసలు తగ్గగా.. తాజాగా మరోసారి 15 పైసలు వరకు తగ్గింది. డీజిల్‌ ధర ఈ నెల 18, 20 తేదీల్లో 20 పైసల చొప్పున తగ్గుదల నమోదైంది.
 
దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో పెట్రోలు ధరల వివరాలను పరిశీలిస్తే, ఢిల్లీలో పెట్రోల్‌ రూ.101.49.. డీజిల్‌ రూ.88.92, ముంబైలో పెట్రోల్‌ రూ.107.52.. డీజిల్‌ రూ.96.48, చెన్నైలో పెట్రోల్‌ రూ.99.20.. డీజిల్‌ రూ.93.52, కోల్‌కతాలో పెట్రోల్‌ రూ. 101.82.. డీజిల్‌ రూ.91.98, హైదరాబాద్‌లో పెట్రోల్‌ రూ.105.54.. డీజిల్‌ రూ.96.99 చొప్పున ఉన్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సోషల్ మీడియాలో కీర్తి సురేష్ మార్ఫింగ్ ఫోటోలు... బోరుమంటున్న నటి

మీకు దణ్ణం పెడతా, నేను సన్యాసం తీసుకోవట్లేదు: రేణూ దేశాయ్ (video)

Joy Crizildaa: నీకు దమ్ముంటే డీఎన్ఏ టెస్టుకు రావయ్యా.. మాదంపట్టికి జాయ్ సవాల్

NC24: నాగ చైతన్య, మీనాక్షి చౌదరి చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ రాబోతోంది

Bhagyashree Borse: అరుంధతి వంటి క్యారెక్టర్స్ చాలా ఇష్టం : భాగ్యశ్రీ బోర్సే

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments