Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇంగ్లాండ్‌కు గట్టి షాక్.. గాయంతో మార్క్ వుడ్ దూరం..

Advertiesment
England vs India
, సోమవారం, 23 ఆగస్టు 2021 (19:05 IST)
భారత్‌తో జరిగిన రెండో టెస్టు మ్యాచ్ ఓడిన ఇంగ్లాండ్.. మూడో టెస్టులో విజయం సాధించి సిరీస్‌ను సమయం చేయాలని తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అయితే ఆ జట్టుకు షాక్ తగిలింది. భుజం గాయంతో ఆ జట్టు స్టార్‌ పేసర్ మార్క్ వుడ్ హెడింగ్లీ మూడో టెస్ట్‌కు దూరమయ్యాడు. 
 
రెండో టెస్టు నాలుగో రోజు ఆటలోనే గాయపడిన అతను పూర్తి ఫిట్‌నెస్ సాధించలేకపోవడంతోమూడో టెస్ట్‌కు దూరంగా ఉంటాడని ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు ప్రకటించింది. అయితే 31 ఏండ్ల మార్క్‌ వుడ్‌ జట్టుతోనే ఉంటాడని, వైద్యుల పర్యవేక్షణలో కోలుకోవడంపై దృష్టిసారిస్తాడని తెలిపింది.
 
మూడో టెస్ట్ అనంతరం అతనికి మరోసారి ఫిట్‌నెస్‌ పరీక్ష నిర్వహిస్తామని అప్పటికీ కోలుకోలేకపోతే సిరీస్‌ నుంచి తప్పిస్తామని ఈసీబీ పేర్కొంది. భారత్ ఇంగ్లాండ్ ల మధ్య బుధవారం నుంచి మూడో టెస్ట్‌ ప్రారంభం కానుంది. 
 
ఇప్పటికే గాయాలతో బ్రాడ్, వోక్స్, అర్చర్ సేవలను కోల్పోయిన ఇంగ్లాండ్ జట్టుకు ఇది పెద్ద షాకే. అయితే గాయం కారణంగా దూరమైన వుడ్ స్తానంలో సకిబ్ మహ్మద్ టెస్టుల్లో అరంగ్రేటం చేసే అవకాశం ఉంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆప్ఘనిస్థాన్ క్రికెట్‌కు మద్దతు ప్రకటించిన తాలిబన్ తీవ్రవాదులు