Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇంగ్లండ్‌లో కాల్పుల కలకలం : ఆరుగురి మృతి

Advertiesment
ఇంగ్లండ్‌లో కాల్పుల కలకలం : ఆరుగురి మృతి
, శుక్రవారం, 13 ఆగస్టు 2021 (12:15 IST)
నైరుతి ఇంగ్లండ్‌లోని ప్లైమౌత్ నగరంలో శుక్రవారం ఉదయం కాల్పుల కలకలం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఆరుగురు చనిపోయినట్లు స్థానిక పోలీసుల సమాచారం. కాల్పులకు తెగబడిన దుండగులకు ఉగ్రవాదులతో ఎలాంటి సంబంధాలు లేవని ప్రాథమికంగా నిర్ధారించారు. 
 
మృతుల్లో కాల్పుల జరిపిన ఓ వ్యక్తి కూడా ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో మరికొంత మందికి గాయాలైనట్లు డెవాన్, కార్న్‌వాల్ పోలీసులు ట్విట్టర్‌లో పేర్కొన్నారు. వారిని ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. 
 
కీహామ్​జిల్లాలో జరిగిన ఈ ఘటనపై మరిన్ని వివరాలు అందించడానికి పోలీసులు నిరాకరించారు. ఎయిర్​ అంబులెన్స్​, పారా మెడికల్​ సిబ్బంది త్వరితగతిన స్పందించారు. చనిపోయిన వారిలో ఇద్దరు మహిళలు ఉన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పంద్రాగ‌స్టు ప‌రేడ్ గౌండ్ లో క‌రోనా అలెర్ట్!