Webdunia - Bharat's app for daily news and videos

Install App

తాలిబన్లను నల్లిని నలిపినట్టు నలిపేస్తున్న గ్రామస్థులు.. ఎక్కడ?

Webdunia
మంగళవారం, 24 ఆగస్టు 2021 (09:33 IST)
ఆప్ఘనిస్థాన్ రాజధాని కాబూల్‌ను ఆధీనంలోకి తీసుకున్ తాలిబన్ తీవ్రవాదులు మరికొన్ని ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ దేశంలోని అన్ని ప్రాంతాలను తమ గుప్పెట్లో పెట్టుకోవాలన్న తలంపులో తాలిబన్ తీవ్రవాదులు ఉన్నారు. ఇందులోభాగంగా, ఇప్పటికే కాబూల్ మొత్తం తాలిబన్ల వశమైంది. ఇక మిగిలిన ప్రాంతాలపై కూడా వారు కన్నేశారు. 
 
ఇలాంటి ప్రాంతాల్లో ఒకటి పంజ్‌షిర్. మొత్తం 150 కిలోమీటర్ల వైశాల్యం కలిగిన ఈ ప్రాంతంలో మొత్తం ఏడు జిల్లాలు 512 గ్రామాలు ఉన్నాయి. మొత్తం జనాభా 1.50 లక్షలు మాత్రమే. వీరిలో 20 వేల మంది యువతీ యుకులు చేతిలో ఆయుధాలు ధరించి తమతమ ప్రాంతాలను రక్షించుకునే పనిలోవున్నారు. ముఖ్యంగా, తాలిబన్ తీవ్రవాదులు తమ ప్రాంతాల్లోకి వస్తుంటే చాలు.. వారిని పట్టుకుని నల్లులను నలిపివేసినట్టు నలిపేస్తున్నారు. తాలిబన్లు అడుగుపెట్టాలనుకున్న ప్రతి గ్రామంలోనే ఇదే స్థాయిలో ప్రతిఘటన ఎదురవుతుంది. 
 
గ్రామ సరిహద్దుకు వచ్చిన తాలిబన్లను పట్టుకుని నిర్దాక్షిణ్యంగా హతమార్చుతున్నారు. అయితే, తాలిబన్లను పట్టుకునేందుకు ఆ గ్రామస్థులు ఎలా వస్తున్నారో.. ఎలా పట్టుకుంటున్నారో.. ఎలా హతమార్చుతున్నారో ఎవరికీ అంతుచిక్కడం లేదు. ఇప్పటికే 800 మంది తాలిబన్ తీవ్రవాదలను చంపేశారంటే వారు ఎంత పకడ్బంధీగా వ్యూహాలు అమలు చేస్తున్నారో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ramcharan: పెద్ది లో కొత్త లుక్ లో రామ్ చరణ్ ను చూపించనున్న స్టైలిస్ట్ ఆలీం హకీం

బరాబర్ ప్రేమిస్తా’ నుంచి పాట విడుదల చేసిన బన్నీ వాస్

లిటిల్ హార్ట్స్ మూవీలో లైవ్ లీగా చూపించారు : అనిల్ రావిపూడి

రిషబ్ శెట్టి మూవీ కాంతార చాప్టర్ 1 నుంచి గుల్షన్ దేవయ్య లుక్

కబడ్డీ బ్యాక్ డ్రాప్ లో అర్జున్ చక్రవర్తి లాంటి సినిమా రాలేదు : నిర్మాత శ్రీని గుబ్బల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments