Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Thursday, 27 March 2025
webdunia

తాలిబన్లపై ఆంక్షలు ఎత్తివేయబోం: అమెరికా

Advertiesment
తాలిబన్లపై  ఆంక్షలు ఎత్తివేయబోం: అమెరికా
, సోమవారం, 23 ఆగస్టు 2021 (12:53 IST)
తాలిబన్లపై ఆంక్షలను ఎత్తివేసేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ నిరాకరించారు. కాబూల్‌లో మునుముందు తాలిబన్ల ప్రవర్తనపై తమ నిర్ణయం ఆధారపడి ఉంటుందని అన్నారు.

తాలిబన్లపై ఆంక్షలకు మద్దతునిస్తారా అని రెజ్‌వెల్ట్‌ రూమ్‌లో జరిగిన సమావేశంలో ప్రశ్నించగా... 'అవును. ఇది వారి ప్రవర్తనపై ఆధారపడి ఉంటుంది' అని వ్యాఖ్యానించారు. కాబూల్‌ అంతర్జాతీయ విమానాశ్రయం చుట్లూ రక్షణ వలయాన్ని మరింత విస్తరిస్తామని బైడెన్‌ తెలిపారు.

అదే సమయంలో ఆగస్టు 31 నాటికి పూర్తి కానున్న భద్రతా దళాల ఉపసంహరణను పొడిగించే సాధ్యాసాధ్యాలపై అమెరికా భద్రతా దళాలతో చర్చిస్తామని చెప్పారు.

అంతకముందు అమెరికా జాతీయ భద్రతా సలహాదారు (ఎన్‌ఎస్‌ఎ) జేక్‌ సలివన్‌ మాట్లాడుతూ.. కాబూల్‌ విమానాశ్రయం నుండి తరలింపు కార్యకలాపాలకు తాలిబన్లు ఆటంకం కలిగిస్తే అమెరికా వారికి గట్టిగా బుద్ధి చెబుతుందని హెచ్చరించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సుప్రసిద్ధ అమర్నాథ్ యాత్ర ముగిసింది