Webdunia - Bharat's app for daily news and videos

Install App

జీఎస్టీ పరిధిలోకి పెట్రోల్.. అరుణ్ జైట్లీ

నానాటికీ పెరిగిపోతున్న పెట్రోల్ డీజిల్ ధరలపై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పందించారు. ఇంధన ధరలను కూడా జీఎస్టీ పరిధిలోకి తెచ్చేందుకు తమకెలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు.

Webdunia
గురువారం, 26 అక్టోబరు 2017 (05:58 IST)
నానాటికీ పెరిగిపోతున్న పెట్రోల్ డీజిల్ ధరలపై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పందించారు. ఇంధన ధరలను కూడా జీఎస్టీ పరిధిలోకి తెచ్చేందుకు తమకెలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. అయితే, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు దీనికి అంగీకరించాల్సి ఉందన్నారు. ఇదే అంశంపై ఆయన స్పందిస్తూ, ఇప్పటికే కేంద్రం సెస్సు తగ్గించటం ద్వారా రెండు రూపాయల తగ్గిన విషయాన్ని చెబుతూనే.. జీఎస్టీ పరిధిలోకి తీసుకురావటానికి అభ్యంతరం లేదన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వాలు అన్నీ కూడా దీనికి అంగీకరించాల్సి ఉంటుందన్నారు. 
 
పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావటానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. చివరగా నిర్ణయం తీసుకోవాల్సింది రాష్ట్ర ప్రభుత్వాలే అన్నారు. వాళ్లే వ్యతిరేకంగా ఉన్నారన్నారు. వ్యాట్‌ను తగ్గించాలని ఇటీవల కేంద్రం పిలుపునిచ్చిందని.. దీనికి స్పందించింది కేవలం హిమాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలు మాత్రమే అన్నారు. 
 
పెట్రో ధరలు విపరీతంగా పెరగటంపై ఇటీవల దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్న విషయంతెల్సిందే. అంతర్జాతీయంగా ముడి ఇంధన ధరలు తగ్గినా.. దేశంలో పెరగటాన్ని నిలదీస్తున్నారు జనం. ఈ క్రమంలోనే జీఎస్టీ పరిధిలోకి తీసుకువస్తే ధరలు కనీసం 30 శాతం తగ్గుతాయని.. ఇదొక్కటే పరిష్కారం అని ఇటీవలే కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి కూడా వ్యాఖ్యానించారు. ఇప్పుడు జైట్లీ సైతం అదేవిధంగా స్పందించటంతో.. రాష్ట్రాలపై ఒత్తిడి పెరిగినట్లే. భారం అంతా రాష్ట్రాలపైనే పడుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అల్లు అర్జున్ స్థానంలో ఎన్టీఆర్ ను తీసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments