Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నోట్లరద్దు, జీఎస్టీ అమలుతో ప్రతి ఒక్కరికీ మేలు : అరుణ్ జైట్లీ

నోట్ల రద్దు, జీఎస్టీ అమలుతో ప్రతి ఒక్కరికీ మేలు జరుగుతోందని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ అంటున్నారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ... మ‌న‌దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ మూలాలు బాగానే ఉన్నాయన్నారు. ఈ మూడేళ్ల‌లో

Advertiesment
నోట్లరద్దు, జీఎస్టీ అమలుతో ప్రతి ఒక్కరికీ మేలు : అరుణ్ జైట్లీ
, మంగళవారం, 24 అక్టోబరు 2017 (17:13 IST)
నోట్ల రద్దు, జీఎస్టీ అమలుతో ప్రతి ఒక్కరికీ మేలు జరుగుతోందని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ అంటున్నారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ... మ‌న‌దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ మూలాలు బాగానే ఉన్నాయన్నారు. ఈ మూడేళ్ల‌లో దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ, వృద్ధిరేటు బాగానే ఉందని చెప్పారు. 
 
అలాగే, ఎలాంటి స‌వాళ్ల‌నైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామ‌న్నారు. ఆర్థిక సంస్క‌ర‌ణ‌ల ఫ‌లితాలు అందరికీ అందుతాయ‌ని చెప్పారు. కేంద్ర ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యాలు ఆర్థిక వ్య‌వ‌స్థపై బాగా ప‌నిచేస్తున్నాయని చెప్పారు. విదేశీ మార‌కం నిల్వ‌లు 400 బిలియ‌న్ డాల‌ర్లు దాటాయని అన్నారు. 
 
గ‌త మూడేళ్లుగా భార‌త్ ఆర్థికాభివృద్ధిలో ప‌రుగులు తీస్తోందన్నారు. ఈ సంద‌ర్భంగా కేంద్ర ఆర్థిక శాఖ అధికారులు మాట్లాడుతూ చైనా వృద్ధిరేటు 6 శాతం వ‌ద్దే నిలిచిపోతే.. భార‌త్ 8 శాతం న‌మోదు చేస్తోంద‌ని చెప్పారు. గ‌త మూడేళ్లుగా జీడీపీ స‌గ‌టు 7.5 శాతంగా ఉంద‌ని వివ‌రించారు. నోట్లరద్దు, జీఎస్టీ అమలు అతిపెద్ద ఆర్థిక సంస్కరణలని అన్నారు.  
 
అదేసమయంలో పన్ను చెల్లింపుదారులకు ఆగస్టు, సెప్టెంబర్ నెలలకుగానూ గడువులోగా జీఎస్టీ రిటర్నులు దాఖలు చేయని వారికి విధించిన జరిమానాను మాఫీ చేస్తున్నట్టు తెలిపారు. ‘‘పన్ను చెల్లింపుదారులకు సులభంగా ఉండేలా ఆగస్టు, సెప్టెంబర్ నెలలకు గానూ జీఎస్టీఆర్-3బీ ఫైలింగ్‌పై ఆలస్యపు రుసుమును మాఫీ చేశాం. చెల్లించిన లేట్ ఫీజులను పన్ను చెల్లింపుదారుల ఖాతాల్లో తిరిగి జమచేస్తాం..’’ అని వెల్లడించారు.
 
ప్ర‌ధాన‌మంత్రి మోడీ ప్ర‌భుత్వం తీసుకుంటోన్న నిర్ణ‌యాల వల్ల దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ నాశనం అయిపోతోంద‌ని విప‌క్ష పార్టీలు పెద్ద ఎత్తున‌ విమ‌ర్శ‌లు చేస్తోన్న విష‌యం తెలిసిందే. అంతేగాక‌, సొంత పార్టీ నేత‌లు కూడా ఎన్డీఏ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో అన్నింటికీ స‌మాధానం చెబుతూ దేశ ఆర్థిక వ్య‌వస్థ‌పై కేంద్ర ప్ర‌భుత్వం మంగళవారం ఢిల్లీలో ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్ ఇచ్చింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తిరుపతిలో చిరుత కలకలం.. కుక్కను చంపి...