ప్రజలు మెచ్చే పనులు చేయలేం : విత్తమంత్రి అరుణ్ జైట్లీ
దేశ ప్రజలు మెచ్చే పనులు చేయలేమనీ, తమముందున్న లక్ష్యం.. ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్లడమేనని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్ సమావేశాల నిమిత్తం అమెరికాలో పర్
దేశ ప్రజలు మెచ్చే పనులు చేయలేమనీ, తమముందున్న లక్ష్యం.. ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్లడమేనని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్ సమావేశాల నిమిత్తం అమెరికాలో పర్యటించిన ఆయన, ఓ టీవీ చానల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, దేశ ప్రజలు మెచ్చుకోవాలని భావిస్తూ వారికి నచ్చే విధంగా విధాన నిర్ణయాలను తాము తీసుకోవడం లేదన్నారు.
దేశ ఆర్థిక వ్యవస్థను సరైన దిశగా తీసుకు వెళ్లేందుకు సహకరించే అసలైన నిర్ణయాలనే తాము తీసుకుంటున్నామని, సరైన దారిలో నడుస్తున్నామనే భావిస్తున్నామన్నారు. ఎన్నికల్లో ఓట్ల కన్నా, దేశాభివృద్ధే ముఖ్యమని గట్టిగా నమ్మే నరేంద్ర మోడీ వంటి నేత దేశానికి ఓ వరమన్నారు. తాత్కాలికంగా ఇబ్బందులు ఎదురవుతున్నట్టు కనిపించినా, జీఎస్టీ, నోట్ల రద్దు తదితర కారణాలతో లాభమే అధికంగా జరగనుందన్నారు.
ఆర్థిక వ్యవస్థలో వ్యవస్థీకృత మార్పులు చేస్తున్నామని అరుణ్ జైట్లీ వెల్లడించారు. ప్రపంచంలోని అగ్రదేశాలతో పోటీ పడేలా ఆర్థిక వ్యవస్థ బలపడాలంటే, ఇప్పుడు ఎన్డీయే ప్రభుత్వం అమలు చేస్తున్న సంస్కరణలు అత్యంత కీలకమని తెలిపారు. 2020 తరువాత ఆర్థిక వృద్ధి రేటు రెండంకెల సంఖ్యకు చేరుతుందని తాను నమ్ముతున్నట్టు వెల్లడించారు.