Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలోని కొత్తపేట వద్ద తమ నూతన స్టూడియో ప్రారంభించిన పెప్పర్‌ఫ్రై

Webdunia
శుక్రవారం, 2 సెప్టెంబరు 2022 (23:21 IST)
ఈ కామర్స్‌ ఫర్నిచర్‌, గృహ ఉత్పత్తుల కంపెనీ పెప్పర్‌ఫ్రై, తెలంగాణాలోని కొత్తపేటలో తమ నూతన స్టూడియో ప్రారంభించినట్లు వెల్లడించింది. ఈ ఆఫ్‌లైన్‌ విస్తరణ, సముచిత మార్కెట్‌లలో విస్తరించడంతో పాటుగా భారతదేశంలో ఫర్నిచర్‌ మరియు గృహ ఉత్పత్తుల విభాగంలో అతిపెద్ద ఓమ్నీ ఛానెల్‌ వ్యాపారాన్ని సృష్టించాలనే కంపెనీ లక్ష్యానికి అనుగుణంగా ఉంటుంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 90కు పైగా నగరాలలో 180కు పైగా స్టూడియోలు పెప్పర్‌ ఫ్రైకు ఉన్నాయి. 
 
భారతదేశంలో ఫర్నిచర్‌ రిటైల్‌ ల్యాండ్‌స్కేప్‌ను సమూలంగా పెప్పర్‌ ఫ్రై మార్చింది. ఈ కంపెనీ యొక్క ఓమ్నీ ఛానెల్‌ వ్యూహంకు ఫోఫో స్టూడియోలను దేశవ్యాప్తంగా విస్తరించడం మద్దతునందిస్తుంది. ప్రస్తుతం 90కు పైగా వినూత్నమైన భాగస్వాములతో కలిసి పనిచేస్తుంది. ఈ నూతన స్టూడియోను నెస్ట్‌ ఇంటీరియో క్రియేషన్స్‌ భాగస్వామ్యంతో ప్రారంభించారు. సరూర్‌ నగర్‌లోని  అత్యంత కీలకమైన వాణిజ్య ప్రాంతం కొత్తపేట వద్ద ఇది 1680 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. ఇది వినియోగదారులకు అసంఖ్యాక డిజైన్లతో కూడిన ఫర్నిచర్‌, హోమ్‌ ప్రొడక్ట్స్‌తో కూడిన కేటలాగ్‌ను ప్రత్యేకంగా వీక్షించే అవకాశం అందిస్తుంది.  కంపెనీ యొక్క ఇంటీరియర్‌ డిజైన్‌ కన్సల్టెంట్ల నుంచిప్రత్యేక డిజైన్‌ సలహాలను సైతం వినియోగదారులు పొందవచ్చు. కొత్తపేటలోని ఈ స్టూడియో వ్యక్తిగతీకరించిన షాపింగ్‌ అనుభవాలను అందించడం లక్ష్యంగా చేసుకుంది. దీనిని తెలంగాణాలోని  వినియోగదారుల వినూత్న అవసరాలను సైతం తీర్చనుంది. 
 
ఈ స్టూడియోప్రారంభం గురించి  పెప్పర్‌ ఫ్రై ఫ్రాంచైజింగ్‌ అండ్‌ అలయెన్సస్‌ బిజినెస్‌ హెడ్‌, అమృత గుప్తా మాట్లాడుతూ, ‘‘నెస్ట్‌ ఇంటీరియో క్రియేషన్స్‌‌తో భాగస్వామ్యం చేసుకుని  కొత్తపేటలో మా నూతన స్టూడియోను ప్రారంభించడం పట్ల సంతోషంగా ఉన్నాము. ఓ పెప్పర్‌ఫ్రై ఫ్రాంచైజీ సొంతం చేసుకోవడమన్నది వ్యాపార పరంగా విజయం సాధించడమే. మేము టియర్‌ 1 నగరాలు మరియు భారీ మెట్రోపాలిటిన్‌ నగరాలకు ఆవల కూడా వినియోగదారులను చేరుకోవాలని కోరుకుంటున్నాము. మా ఫ్రాంచైజీ భాగస్వాములలో విజయవంతమైన వ్యాపారవేత్తలు, మహిళా వ్యాపార వేత్తలు, మాజీ ఆర్మీ అధికారులు, మొదటి సారి వ్యాపారస్తులుగా మారిన వారు ఉన్నారు. నేడు భారీ సంఖ్యలోని మా పెప్పర్‌ ఫ్రై వినియోగదారులు ఏఆర్‌ , వర్ట్యువల్‌ ప్రొడక్ట్‌ ఇంటరాక్షన్లపై ఆధారపడి ఉంటున్నాయి.  ప్రపంచ వ్యాప్తంగా ఇల్లు అనే భావనను రేకెత్తించే మా లక్ష్యంతో, మేము మహోన్నతమైన వినియోగదారుల సేవలను స్ధిరంగా అందించడానికి ప్రయత్నిస్తున్నాము’’ అని అన్నారు.
 
ఫ్రాంచైజీ స్టూడియో భాగస్వాములు ప్రవీణ్‌ వుదయగిరి- రాఘవేంద్ర గోనెగండ్ల మాట్లాడుతూ ‘‘భారతదేశపు సుప్రసిద్ధ గృహ, ఫర్నిచర్‌ మార్కెట్‌ ప్రాంగణం పెప్పర్‌ ఫ్రైతో భాగస్వామ్యం చేసుకోవడం పట్ల మేము చాలా సంతోషంగా ఉన్నాము. పూర్తి వైవిధ్యమైన  ఓమ్నీ ఛానెల్‌ వ్యాపారం పెప్పర్‌ ఫ్రై.  అతి పెద్ద ఓమ్నీఛానెల్‌ గృహ, ఫర్నిచర్‌ వ్యాపారం సృష్టించాలనే వారి ప్రయాణంలో చేరడం పట్ల మేము చాలా సంతోషంగా ఉన్నాము’’ అని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓ హీరో ఇబ్బందికరంగా ప్రవర్తించారు.. : సినీ నటి ఖుష్బూ

డిసెంబర్ నుంచి స్ట్రీమింగ్ కానున్న హరికథ వెబ్ సిరీస్

ఖర్చుపెట్టినా దక్కని ఫలితంతో ఎస్కేప్ అయిన నిర్మాత

ఎస్ఎస్ థమన్ లాంచ్ చేసిన అల్లరి నరేష్, అమృత అయ్యర్ బచ్చల మల్లి మెలోడీ సాంగ్

కన్నప్ప లో మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

క్యాబేజీతో బిర్యానీ.. పెరుగు పచ్చడితో టేస్ట్ చేస్తే.. అదిరిపోతుంది...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

తర్వాతి కథనం
Show comments