Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌లో కరోనా సునామీ.. పతనమవుతున్న ముడిచమురు ధరలు.. అయినా...

Webdunia
బుధవారం, 21 ఏప్రియల్ 2021 (13:41 IST)
భారత్‌లో కరోనా సునామీ కొనసాగుతోంది. ఈ ప్రభావం అంతర్జాతీయంగా ముడి చమురు ధరలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. భారత్‌లో కరోనా కేసులు పెరుగుతుంటే, ముడిచమురు ధరలు మాత్రం నానాటికీ పతనమైపోతున్నాయి. కానీ, దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. 
 
నిజానికి ప్ర‌పంచంలో ముడి చ‌మురు దిగుమతుల‌తో ఇండియాది మూడోస్థానం. దీంతో భారత్‌లో ఆందోళ‌న‌క‌ర స్థాయిలో పెరిగిపోతున్న క‌రోనా కేసుల‌తో ఆయిల్‌కు డిమాండ్ త‌గ్గిపోతోంది. మంగ‌ళ‌వారం బ్రెంట్ క్రూడాయిల్ ధ‌ర 48 సెంట్లు ప‌డిపోగా.. బుధ‌వారం మ‌రో 48 సెంట్లు ప‌త‌న‌మైంది. 
 
ప్ర‌స్తుతం బ్యారెల్ ముడి చ‌మురు ధ‌ర 66.09 డాల‌ర్లుగా ఉంది. అతి పెద్ద ముడిచ‌మురు వినియోగ‌దారుల్లో ఇండియా కూడా ఒక‌టని, ఇక్క‌డ కేసులు పెరిగిపోతున్న త‌రుణంలో క‌రోనా క‌ట్ట‌డికి తీసుకుంటున్న చ‌ర్య‌లు ఆయిల్ డిమాండ్‌ను త‌గ్గిస్తాయ‌ని కోట‌క్ సెక్యూరిటీస్ కమాడిటీస్ వైస్ ప్రెసిడెంట్ ర‌వీంద్ర రావ్ అన్నారు.
 
ఇప్ప‌టికే ఓపెక్‌, దాని మిత్ర దేశాలు ఆయిల్ ఉత్ప‌త్తిని భారీగా పెంచాయ‌ని, రానున్న రోజుల్లో అందుకు త‌గిన‌ట్లు డిమాండ్ ఏర్ప‌డ‌క‌పోతే ధ‌ర‌లు మరింత ప‌త‌న‌మ‌వుతాయని ఆయ‌న ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా కట్టడికోసం ఇప్ప‌టికే ప‌లు రాష్ట్రాల్లో లాక్డౌన్లు విధించారు. దీని ప్ర‌భావం ముడి చ‌మురు వినియోగంపైనా ప‌డింది. డిమాండ్ త‌గ్గ‌డంతో రిఫైన‌రీలు ఉత్ప‌త్తిని త‌గ్గించాయని గుర్తుచేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మన బాడీకి తల ఎంత ముఖ్యమో నాకు తలా సినిమా అంతే : అమ్మ రాజశేఖర్

హిట్స్, ఫ్లాప్స్ ని ఒకేలా అలవాటు చేసుకున్నాను :శ్రద్ధా శ్రీనాథ్

నిజాయితీగా పనిచేస్తే సినీ పరిశ్రమ ఎవరికి అన్యాయం చేయదు. బోయపాటి శ్రీను

లక్ష రూపాయలు గెలుచుకోండంటూ డియర్ కృష్ణ వినూత్న కాంటెస్ట్

మూడు భాషల్లో ఫుట్ బాల్ ప్రేమికుల కథ డ్యూడ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరువెచ్చని నిమ్మరసంలో ఉప్పు కలిపి తాగితే 9 ప్రయోజనాలు

అనుకోకుండా బరువు పెరగడానికి 8 కారణాలు, ఏంటవి?

ఉడికించిన వేరుశనగ పప్పు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మహిళల్లో జ్ఞాపకశక్తి పెరగాలంటే.. రోజూ ఓ కోడిగుడ్డు తినాల్సిందేనట

క్యాల్షియం స్థాయిలను వృద్ధి చేసే 6 సహజసిద్ధ పానీయాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments