Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిజమా? కలయా? ముకేష్ అంబానీ ఆస్తి ఆవిరైందంటే నమ్ముతారా?

Webdunia
మంగళవారం, 3 నవంబరు 2020 (14:46 IST)
ఇది నిజమా? లేకుంటే కలయా? అనే డౌట్ రాక తప్పదు. అత్యంత సంపన్నుడు ముకేష్ అంబానీ ఆస్తి ఆవిరైందంటే నమ్ముతారా? నమ్మి తీరాల్సిందే. ఒకటి కాదు.. రెండు కాదు.. లక్ష కోట్ల సంపద గంగలో కలిసింది. పదమూడున్నర లక్షల కోట్ల నుంచి పన్నెండున్నర లక్షల కోట్లకి చేరింది ముఖేశ్ అంబానీ ఆస్తి. ఆసియ అపర కుబేరుల్లో టాప్‌లో ఉండే అంబానీ ఆస్తి లక్ష కోట్లు తగ్గిందంటే ఉత్తి మాటలు కావు.
 
అయితే ఇలా ఎందుకు జరిగిందంటే? అంతా కరోనా వల్లే. కంటికి కనిపించకుండానే లక్షల కోట్లు మింగేసింది కోవిడ్. ఇప్పుడు అంబానీ ఆస్తి కరిగి పోవడానికి కూడా ఆ కరోనానే కారణం. లాక్ డౌన్ కాలంలో జనాలు ఇంటికే పరిమితం అయ్యారు. దీంతో ఇంధన డిమాండ్ తగ్గిపోయి.. షేర్లు అన్నీ డౌన్ అయిపోయాయి. 
 
ఇప్పటికీ షేర్లు నష్టాల్లోనే ఉన్నాయని తెలిసింది. ఇంకో విషయం ఏందంటే టాప్ బిలినియర్లలో ఆరో ప్లేస్‌లో ఉన్న అంబానీ.. ఏకంగా తొమ్మిదో ప్లేస్‌కి వచ్చేశారని రిపోర్టును బట్టి తెలుస్తోంది. మొత్తానికి కరోనా సామాన్యుల నుంచి సంపన్నుల వరకు ఓ ఆట ఆడుకుంటుందనే చెప్పాలి.

సంబంధిత వార్తలు

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments