Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఎదురులేని ముఖేష్ అంబానీ : ఫోర్బ్స్ జాబితాలో తెలుగోళ్లు... (Video)

ఎదురులేని ముఖేష్ అంబానీ : ఫోర్బ్స్ జాబితాలో తెలుగోళ్లు... (Video)
, శుక్రవారం, 9 అక్టోబరు 2020 (08:44 IST)
భారత పారిశ్రామికవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీ అధినేత ముఖేష్ అంబానీకి దేశంలో తిరుగులేకుండా ఉంది. అటు తన వ్యాపార సామ్రాజ్యాన్ని అంచలంచెలుగా విస్తరించుకుంటూ పోతున్నారు. దీంతో ఆయన కంపెనీల్లో పెట్టుబడులు వరదలా వచ్చిపడుతున్నాయి. ఫలితంగా ఆయన ఆస్తి విలువ అంతకంతకూ పెరిగిపోతోంది. దీంతో అపర కుబేరుల జాబితాలో ఆయన దేశంలోనే మొదటి ధనవంతుడుగా నిలిచారు. ఫోర్బ్స్ జాబితాలో ముఖేష్ అంబానీ పేరు రావడం ఇది 13వ సారి కావడం గమనార్హం. 
 
తాజాగా, ప్రపంచ ప్రఖ్యాత ఫోర్బ్స్ ప్రకటించిన ర్యాంకుల్లో అంబానీ వరుసగా 13వ పర్యాయం ఈ ఘనత సాధించారు. దేశంలోనే అత్యంత ధనికుడిగా నిలిచిన ఈ రిలయన్స్ అధినేత ఆస్తి కూడా అమాంతం పెరిగిపోయింది. కొన్నాళ్ల కిందట 37.3 బిలియన్ డాలర్లుగా ఉన్న ముఖేశ్ సంపద ఇప్పుడు 88.7 బిలియన్ డాలర్లకు పెరిగింది. భారత బిలియనీర్ల జాబితాలో ముఖేశ్ తర్వాత గౌతమ్ అదానీ రెండోస్థానంలో ఉన్నారు. ఆయన సంపద విలువ 25.2 బిలియన్ డాలర్లు.
 
ఇకపోతే, ఈ జాబితాలో ఈ దఫా తెలుగు వ్యాపారవేత్తలు కూడా చోటు దక్కించుకున్నారు. ఫోర్బ్స్ వెలువరించిన టాప్-100 భారత బిలియనీర్ ర్యాంకుల జాబితాలో తెలుగు వ్యాపారవేత్తలు ఉన్నారు. దివీస్ ల్యాబొరేటరీస్ అధినేత మురళి దివి (6.5 బిలియన్ డాలర్లు) 20వ స్థానంలో, డాక్టర్ రెడ్డీస్ కుటుంబం (3.25 బిలియన్ డాలర్లు) 43వ స్థానంలో, మేఘా ఇంజినీరింగ్ పీపీ రెడ్డి (3.1 బిలియన్ డాలర్లు) 45వ స్థానంలో, అరబిందో రాంప్రసాద్ రెడ్డి (2.9 బిలియన్ డాలర్లు) 49వ ర్యాంకులో నిలిచారు. 

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రీ-ఇమేజిన్డ్ చేయబడిన సరికొత్త ఎకో ఫ్యామిలీ ఆవిష్కారం, మీ ఇంట్లో సందడే సందడి