Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎలక్ట్రిక్ కార్ల విఫణిలోకి మారుతి సుజుకి - ఒక్కసారి చార్జింగ్ చేస్తే...

Webdunia
సోమవారం, 14 ఫిబ్రవరి 2022 (16:21 IST)
దేశంలో అతిపెద్ద కార్ల తయారీ కంపెనీగా ఉన్న మారుతి సుజుకి ఇపుడు ఎలక్ట్రిక్ కార్ల తయారీలోకి అడుగుపెట్టింది. తాజాగా మరో కార్ల తయారీ కంపెనీ టయోటాతో కలిసి అత్యాధునిక సౌకర్యాలతో ఓ కారును తయారు చేసింది. ఈ కారుకు ఒక్కసారి చార్జింగ్ చేస్తే ఏకంగా 400 కిలోమీటర్ల మేరకు ప్రయాణం చేసేలా కారును డిజైన్ చేశారు. 
 
దేశంలో ఎలక్ట్రిక్ కార్లను తయారు చేసే కంపెనీల సంఖ్య పెరిగిపోతుంది. ఇప్పటికే పలు కంపెనీలు ఈ తరహా కార్లను తయారు చేస్తున్నాయి. అలాగే, ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు కూడా పెరుగుతున్నాయి. భవిష్యత్‌లో ఎలక్ట్రిక్ వాహనాలదే హవా కానుండటంతో మారుతి సుజుకి కూడా ఈ తరహా కార్ల తయారీపై దృష్టిసారించింది. 
 
ఇందులోభాగంగా ఎంతో ఆకర్షణీయమైన డిజైన్‌తో తాజాగా తయారు చేసిన కారును పరిశీలిస్తే, ఇప్పటివరకు దేశీయ ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్‌లో అందుబాటులో ఉన్న కార్ల కంటే అత్యంత శక్తివంతమైనదిగా భావిస్తున్నారు. ఎందుకంటే ఈ కారును విదేశాలకు సైతం ఎగుమతి చేయాలని భావిస్తున్నారు. అందుకు తగినట్టుగానే ఈ కారును డిజైన్ చేసినట్టు ఆ కంపెనీ వర్గాలు వెల్లడించాయి. 
 
48 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీతో నడిచే ఈ కారును ఒకసారి చార్జింగ్ చేస్తే 400 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించవచ్చు. అదేవిధంగా 59 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీతో నడిచే కారుకు చార్జింగ్ చేస్తే 500 కిమీ వరకు ప్రయాణించవచ్చు. ఈ బ్యాటరీలను గుజరాత్ రాష్ట్రంలో తయారు చేస్తుంది. ఇవి డీడీఎస్జీ లిథియం అయాన్ బ్యాటరీలు. ఈ బ్యాటరీలను కారులో వినియోగించనున్నారు. ఈ కారు ధర మార్కెట్‌లో రూ.13 నుంచి రూ.15 లక్షల వరకు ఉండొచ్చని భావిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏడాది క్రితం ట్వీట్స్ పెడితే ఇప్పుడు మనోభావాలు దెబ్బతినడం ఏంటి: వర్మ లాజిక్

నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్ నుంచి క్వీన్ విద్యా వోక్స్ పాడిన సాంగ్ రిలీజ్

తల్లి మనసు సినిమాకు సెన్సార్ సభ్యుల ప్రశంసలు

అఖిల్ అక్కినేని, జైనాబ్ రావ్‌జీల నిశ్చితార్థం చేశామన్న నాగార్జున

రోటి కపడా రొమాన్స్‌ బాగా లేదంటే సినిమాలకు రిటైర్‌మెంట్‌ : దర్శకుడు విక్రమ్‌ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments