Publish Date: Sun, 13 Feb 2022 (17:07 IST)
Updated Date: Sun, 13 Feb 2022 (17:08 IST)
మోసగాడికి బ్రాండ్ అంబాసిడర్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అంటూ టీపీసీ చీప్ రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై అస్సాం ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి ఖండించారు. అస్సాం ముఖ్యమంత్రిని తక్షణం బర్తరఫ్ చేయాలంటూ ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ చీఫ్ జేపీ నడ్డాలను ఆయన డిమాండ్ చేశారు. పనిలోపనిగా సీఎం కేసీఆర్‌పై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు.
మోసగాడికి బ్రాండ్ అంబాసిడర్ కేసీఆర్ అని వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ను కాంగ్రెస్ పార్టీ రెండుసార్లు నమ్మి మోసపోయిందని, మళ్లీ కేసీఆర్‌ను నమ్మి మోసపోం అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ సీఎం కేసీఆర్‌ను ఎట్టిపరిస్థితుల్లోనూ నమ్మదని అన్నారు.
బీజేపీ, తెరాస పార్టీలు కలిసి తెలంగాణ సమాజాన్ని మభ్యపెట్టాలని చూస్తున్నాయని చెప్పారు. కేంద్రం అవినీతి బయటపెడతా అంటే ఎవరు వద్దని అన్నారు? అని సీఎం కేసీఆర్‌ను రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. మోసగాళ్లకు మోసగాడు, మోసానికి బ్రాండ్ అంబాసిడర్ కేసీఆర్ అంటూ రేవంత్ రెడ్డి మండిపడ్డారు.
ఠాగూర్
Publish Date: Sun, 13 Feb 2022 (17:07 IST)
Updated Date: Sun, 13 Feb 2022 (17:08 IST)