Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాణిజ్య సిలిండర్ ధరపై బాదుడు.. మార్చి ఒకటో తేదీ నుంచి అమలు!

ఠాగూర్
శుక్రవారం, 1 మార్చి 2024 (11:08 IST)
దేశంలో వాణిజ్య అవసరాలకు ఉపయోగించే వంట గ్యాస్ ధరను చమురు సంస్థలు మరోమారు పెంచాయి. ధరల సవరణ చర్యల్లో భాగంగా, మార్చి ఒకటో తేదీ శుక్రవారం చమురు కంపెనీలు ఈ పెరిగిన ధరలను వెల్లడించాయి. ఈ ప్రకారంగా 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.25 మేరకు పెరిగింది. ఈ పెరిగిన ధరలు దేశ వ్యాప్తంగా ఉన్న వాణిజ్య వంట గ్యాస్ వినియోగదారులపై పడుతుంది. తాజా పెంపుతో దేశ రాజధాని న్యూఢిల్లీలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రిటైల్ ధర రూ.1795కు చేరింది. 
 
అలాగే, ఇతర ప్రధాన నగరాలైన కోల్‌కతాలో రూ.1911, ముంబైలో రూ.1749, చెన్నైలో రూ.1960.50కు చేరింది. అయితే, గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు లేదని చమురు కంపనీలు వెల్లడించాయి. మరోవైపు, విమానం ఇంధన ధరలను కూడా కంపెనీలు పెంచాయి. తాజా పెంపుతో కిలోలీటర్ ఏవియేషన్ టర్బైన్ ఫ్యుయల్ ధర రూ.624.37కు చేరిందని చమురు కంపెనీలు విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొన్నాయి. అయితే, గృహ అవసరాలకు వినియోగించే 14 కేజీల వంట గ్యాస్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అలాంటి పాత్రలు చేయను.. అవసరమైతే ఆంటీగా నటిస్తా : టాలీవుడ్ నటి

యాంకర్ రష్మీకి మైనర్ సర్జరీ.. అభిమానుల పరేషాన్!!

రాజ్ తరుణ్ - లావణ్య కేసులో సరికొత్త ట్విస్ట్.. సంచలన వీడియో రిలీజ్

అసభ్యకర పోస్టులు : పోలీసుల విచారణకు హాజరైన శ్రీరెడ్డి

Raj_Sam: రాజ్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సమంత.. వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments