Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భారతీయ కంపెనీలతో లైఫ్ సైన్సెస్‌లో భాగస్వామ్యాలకు నేతృత్వం వహించిన TIQ

Advertiesment
image

ఐవీఆర్

, గురువారం, 29 ఫిబ్రవరి 2024 (23:01 IST)
క్వీన్స్‌లాండ్ ప్రభుత్వ అంకితమైన వ్యాపార సంస్థ అయిన ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ క్వీన్స్‌ల్యాండ్ (TIQ), బయోఏషియా 2024కి గ్లోబల్ స్పాన్సర్‌గా పాల్గొనడం ద్వారా పొందిన అద్భుతమైన ప్రతిస్పందనను వెల్లడించింది. లైఫ్ సైన్సెస్ పరిశ్రమ, ఆరోగ్య సంరక్షణ రంగంలోని ఇతర కంపెనీలతో చర్చలు, సంభావ్య భాగస్వామ్యాలను అన్వేషించడం కోసం ఈ సదస్సు తోడ్పడింది. TIQ నేతృత్వంలో, 8 మంది క్వీన్స్‌ల్యాండ్ పరిశోధకులు, కంపెనీల ప్రతినిధి బృందం సదస్సులో పాల్గొంది.  
 
శ్రీ అభినవ్ భాటియా, సీనియర్ ట్రేడ్ & ఇన్వెస్ట్‌మెంట్ కమీషనర్- దక్షిణాసియా, ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ క్వీన్స్‌ల్యాండ్, మాట్లాడుతూ, “బయోఏషియా 2024లో మా భాగస్వామ్యం ఉమ్మడి పరిశోధన, మొదటి దశ క్లినికల్ ట్రయల్స్, ఉమ్మడి ఔషధ ఆవిష్కరణల ద్వారా ప్రపంచ భాగస్వామ్యాలను ప్రోత్సహించడంలో క్వీన్స్‌లాండ్ యొక్క అంకితభావాన్ని ప్రతిబింబిస్తుంది. ఇవి క్వీన్స్‌లాండ్, లైఫ్ -సైన్స్‌లలో భారతీయ నాయకుల మధ్య జరిగిన సమావేశంలో చర్చించబడిన అంశాలు" అని అన్నారు.
 
క్వీన్స్‌ల్యాండ్ ప్రతినిధి బృందంలో అడ్వాన్స్‌డ్ నానో-స్ట్రక్చర్డ్ మెటీరియల్స్, ప్రెసిషన్ నానోమెడిసిన్, బయోమానుఫ్యాక్చరింగ్‌లో తన మార్గదర్శక పరిశోధనకు ప్రసిద్ధి చెందిన  ప్రొఫెసర్ అలాన్ రోవాన్, క్వీన్స్‌ల్యాండ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్‌లో డైరెక్టరేట్ గ్రోత్ & పార్ట్‌నర్‌షిప్స్ హెడ్ తమన్నా మోనెమ్, ప్రొఫెసర్ ప్రసాద్ యార్లగడ్డ, యూనివర్శిటీ ఆఫ్ సదరన్ క్వీన్స్‌లాండ్ (UniSQ)లో ఇంజినీరింగ్ డీన్; ప్రొఫెసర్ ఎలిజా వైట్‌సైడ్, UniSQ హెడ్ (పరిశోధన); G2OME కన్సల్టింగ్ గ్రూప్ వ్యవస్థాపకుడైన డా. ఆనంద్ గౌతమ్ ఉన్నారు.
 
శ్రీ అభినవ్ భాటియా మాట్లాడుతూ, “3-రోజుల కార్యక్రమం, క్వీన్స్‌లాండ్ ప్రతినిధులు భారతీయ, ప్రపంచ వ్యాప్త సంస్థలతో భాగస్వామ్యాన్ని ఏర్పరచుకోవడానికి పూర్తిగా ఉపయోగించుకున్నారు. ఈ ఈవెంట్ ఆవిష్కరణలకు కేంద్రంగా క్వీన్స్‌లాండ్ స్థానాన్ని మరింత పటిష్టం చేసింది..." అని అన్నారు. బయోఏషియా 2024,  లైఫ్ సైన్సెస్ విభాగంలో క్వీన్స్‌లాండ్- భారతదేశం మధ్య చర్చలు, విజ్ఞాన మార్పిడి- సహకారానికి ఉత్ప్రేరకంగా పనిచేసింది. ఆరోగ్య సంరక్షణ, బయోటెక్నాలజీలో పరస్పర వృద్ధి, ఆవిష్కరణలను ప్రోత్సహించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రుషికొండలో ప్యాలెస్‌ను ప్రారంభించనున్న ఆర్కే రోజా