Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కె.జి.ఎ:న్‌.2 విమర్శపై తగ్గేదేలే అంటున్న దర్శకుడు వెంకటేష్‌ మహా

Advertiesment
maha-yash
, మంగళవారం, 7 మార్చి 2023 (11:43 IST)
maha-yash
ఓ యూ ట్యూబ్‌ ఇంటర్వ్యూలో కేరాఫ్‌ కంచరపాలెం దర్శకుడు వెంకటేష్‌ మహా తనకుకె.జి.ఎ:న్‌.2  సినిమా నచ్చలేదని చెప్పారు. ఇక దానిపై సోషల్‌ మీడియాలో తెగ రచ్చ జరుగుతోంది. వారితోపాటు ఇంటర్వ్యూలో వున్న నందినిరెడ్డి, దర్శకుడు వివేక్‌ ఆత్రేయ కూడా ఆ సినిమాపై కామెంట్‌ చేయలేదు. అయితే నేడు నందిని రెడ్డి మాత్రం ఎవరిని కించపరిచే ఉద్దేశ్యంతో ఆయన అనలేదని, ఏదైనా చర్చ జరిగితే రియాక్ఠ్‌ అవుతూ వుంటామంటూ.. ఏదైనా తప్పు దొర్లివుంటే మన్నించాలంటూ పేర్కొంది.
 
కాగా, కొద్దిసేపటి క్రితమే వెంకటేష్‌ మహా చిన్న వీడియో తన ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశాడు. ఓపీనియన్‌ అనేది ఒక సెక్షన్‌ ఆఫ్‌ పీపుల్‌. నా సినిమాలుకూడా కొంతమంది నచ్చేవి పెడతారు. నచ్చనివి పెడతారు. అలాగే ఆ సినిమాకూ చాలామంది ఒపీనియన్‌ నేను చెప్పాను. నేను మాట్లాడిన మాట ఒక సినిమాలో కల్పిత పాత్రను అన్నమాట. నా పర్సనల్‌గా అది ప్రాబ్లమెటిక్‌ పాత్ర అనిపించింది. కానీ ఏ వ్యక్తినీ, క్రియేటివ్‌ పర్సన్‌ను ఉద్దేశించింది మాత్రం కాదు. కానీ అది రియల్‌ లైఫ్‌ పర్సన్‌ను ఆపాదించడం వల్ల సమస్యలా నాకు అనిపిస్తుంది. నా అభిప్రాయాన్ని అర్థం చేసుకోండి. కేవలం కల్పిత పాత్రనే దూషించాను.
 
దాని వల్ల నన్ను అసభ్యంగా దూషించడం జరుగుతుంది. అలా చాలాసార్లు చూశాం. నాకు జరిగిన ఎన్నో సంఘటన ఆధారంగా నా ఒపీనియన్‌ చెప్పాను. నా అభిప్రాయాన్ని గౌరవిస్తారని కోరుకుంటున్నాను. అలాగే అన్ని రకాల సినిమాలను ఒకటే రకమైన గౌరవంతో ఆదరిస్తారని కోరుకుంటున్నాను.  అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

యు.ఎస్‌.ఎ.లో అందాలు ఆస్వాదిస్తున్న ఎన్‌.టి.ఆర్‌.