Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓటీపీ ఉంటేనే గ్యాస్ సిలిండర్ డెలవరీ.. నవంబరు నుంచి నయా రూల్!

Webdunia
శుక్రవారం, 16 అక్టోబరు 2020 (17:49 IST)
ప్రస్తుతం బ్యాంకింగ్ రంగంలో జరుగుతున్న మోసాలకు చెక్ పట్టేందుకు ఓటీపీ విధానం కీలకంగా పనిచేస్తుంది. ఒక బ్యాంకు ఖాతా నుంచి మరో బ్యాంకు ఖాతాకు బదిలీ చేయాలన్నా... ఏటీఎం కార్డు పిన్ నంబరు మార్చాలనుకున్నా, నెట్ బ్యాంకింగ్‌లో ఏదేని మార్పులు చేర్పులు చేయాలన్నా ఖచ్చితంగా ఓటీపీని ఎంటర్ చేయాల్సిందే. ఇదేవిధంగా ఇకపై గ్యాస్ సిలిండర్ డెలివరీ చేయలంటే కూడా ఓటీపీ నంబరును వెల్లడించాల్సిందే. ఈ రూన్ వచ్చే నవంబరు నుంచి అమల్లోకిరానుంది. 
 
నవంబర్‌ నెల నుంచి కొత్త రూల్‌ అమలులోకి రానున్నది. ఈ విధానం కోసం ఆయిల్‌ కంపెనీలు డెలివరీ ప్రామాణిక కోడ్ (డీఏసీ) పేరుతో ఒక కొత్త వ్యవస్థను అందుబాటులోకి తెచ్చాయి. 
 
గ్యాస్‌ సిలిండర్ల చోరీ, వాటిని పక్కదారి పట్టించడం, నిజమైన లబ్ధిదారుడికిగాక మరొకరికి సరఫరా చేయడం వంటివి నియంత్రించడం కోసం ఈ కొత్త విధానాన్ని అమలు చేయనున్నారు. తొలుత వంద స్మార్ట్‌ నగరాల్లో దీనిని అమలు చేసి దేశవ్యాప్తంగా విస్తరించనున్నారు.
 
ఇప్పటికే రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఈ విధానం పైలట్‌ ప్రాజెక్టు కింద అమలవుతోంది. దీని ప్రకారం ఒక వ్యక్తి గ్యాస్ సిలిండర్‌ను బుక్‌ చేయగా వారి రిజిస్టర్‌ మొబైల్‌ నంబర్‌కు ఒక కోడ్‌ వస్తుంది. 
 
గ్యాస్‌ సిలిండర్‌ డెలివరీ సందర్భంగా సిబ్బందికి ఆ కోడ్‌ను చూపించాల్సి ఉంటుంది. దీని కోసం తమ మొబైల్‌ నంబర్‌, అడ్రస్‌ను సంబంధిత గ్యాస్‌ సిలిండర్‌ సరఫరా చేసే సంస్థ ద్వారా అప్‌డేట్‌ చేసుకోవాలి. అయితే వాణిజ్య గ్యాస్‌ సిలిండర్లకు ఈ కొత్త విధానం వర్తించదు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments