మందు బాబులకు మద్రాస్ హైకోర్టు షాకిచ్చింది. తమిళనాడులో మొత్తం మద్యం దుకాణాలను మూసివేయాలని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. కేవలం ఆన్‌లైన్‌లో మాత్రమే మద్యం విక్రయాలకు కోర్టు అనుమతించింది. ఆన్‌లైన్ లిక్కర్ అమ్మకాలకు కూడా మే 17 వరకు మాత్రమే అనుమతి ఇచ్చింది.
రాష్ట్రంలో మద్యం షాపుల వద్ద భౌతిక దూరం పాటించకుండా జనం గుమిగూడటంతో కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. లాక్‌డౌన్ ముగిసేవరకు మద్యం షాపులు తెరవొద్దంటూ ఆదేశించింది. మరోవైపు తమిళనాడులో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. శుక్రవారం ఒక్కరోజే కొత్తగా 600 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 6,009కు పెరిగింది.