Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎల్ఐసీ హెచ్చరిక.. మోసగాళ్ల నుంచి జాగ్రత్త..

Webdunia
శనివారం, 12 జూన్ 2021 (11:44 IST)
LIC
ప్రముఖ బీమా రంగ కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) తమ వినియోగదారులకు నిత్యం అందుబాటులో ఉంటూ వస్తుంది. ఇటీవల వినియోగదారులకు సోషల్ మీడియా ద్వారా ప్రతి చిన్న అప్ డేట్ అందిస్తున్న సంస్థ.. తాజాగా ప్రజలను హెచ్చరించింది. 
 
కంపెనీ లోగోను ఎవరు కూడా ఉపయోగించవద్దని సూచించింది. కంపెనీ అనుమతి లేకుండా.. లోగో ఉపయోగించడం శిక్షార్హమని తెలిపింది. ఇలా చేస్తే కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని ఎల్ఐసీ ప్రకటించింది. ఈ విషయాన్ని ఎల్ఐసీ ట్విట్టర్ వేదికగా వెల్లడించింది.
 
ఏ వెబ్‌సైట్ కానీ లేదంటే ఇతరులు, వ్యాపారులు ఇలా ఎవ్వరూ కూడా కంపెనీ అనుమతి లేనిదే ఎల్‌ఐసీ లోగో ఉపయోగించకూడదని తెలిపింది. అలా చేసినవారికి కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపింది. అంతేకాకుండా.. మరో విషయంపై కూడా కస్టమర్లను ఎల్ఐసీ అలర్ట్ చేసింది. 
 
మోసగాళ్ల నుంచి జాగ్రత్తగా ఉండాలిని కోరింది. ఎల్ఐసీ అధికారులు ఫోన్ కాల్ చేసి పాలసీ నెంబర్లు, పాన్ నెంబర్లు, నామినీ వివరాలు అడగరు అని స్పష్టం చేసింది. ఇలాంటి కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని తెలిపింది. 
 
ఏదైనా అనుమానిత కాల్స్ లేదా అనుమానాస్పద మెయిల్స్ వస్తే.. spuriouscalls@licindia.comకు తెలియజేయాలని తెలిపింది. కంపెనీ కాల్ సెంటర్ నెంబర్లు కూడా అందుబాటులో ఉంచింది. 022-6827 6827 నెంబర్‌కు కాల్ చేయొచ్చు. సందేహాలను పరిష్కరించుకోవచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శుభ్ మన్ గిల్‌తో ప్రగ్యా జైశ్వాల్ ప్రేమ.. నిజమెంత?

రాబిన్‌హుడ్ తో ఈ క్రిస్మస్ మాదే : హీరో నితిన్

శ్రీ గాంధారిగా భయపెట్టించేందుకు వస్తున్న హన్సిక

ముఫాసా: ది లయన్ కింగ్ నుంచి ముఫాసా ప్రయాణంతో షారుఖ్ ఖాన్

వెంకటేష్, ఐశ్వర్య రాజేష్ లపై వెన్నెల రాత్రి నేపథ్యంలో సాంగ్ చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments