Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోస్టాఫీస్ కొత్త స్కీమ్.. డబ్బు రెండింతలు.. లక్ష చేస్తే రెండు లక్షలు..

Webdunia
మంగళవారం, 13 అక్టోబరు 2020 (14:25 IST)
పోస్ట్ ఆఫీస్‌లలో ఎన్నో రకాల స్కీమ్‌లు అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే. ఇలాంటి స్కీమ్‌లలో ఒకటి కిసాన్ వికాస్ పత్ర స్కీమ్. ఇక కిసాన్ వికాస్ పత్రం స్కీమ్ డబ్బులను రెట్టింపు చేసే స్కీమ్ అని చెప్పాలి. ఒక రకంగా చెప్పాలంటే ఒక వేళ ఈ స్కీమ్‌లో మీరు చేరి డబ్బులు పెట్టినట్లయితే ఆ డబ్బు పూర్తిగా రెట్టింపు అయ్యే అవకాశం ఉంటుంది. 
 
అంతేకాదండోయ్ దీనికిగాను పూర్తి గ్యారెంటీ కూడా ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి మీ డబ్బు‌కు హామీ కూడా లభిస్తూ ఉంటుంది. ఇప్పటికే ఎంతోమంది ఇలాంటి స్కీమ్‌లలో డబ్బులు పెట్టిన వారు కూడా ఉన్నారు. అందుకే ఎక్కువ డబ్బులు పెట్టాలనుకున్నప్పుడు బ్యాంకుల్లో కాకుండా పోస్ట్ ఆఫీస్ కెవిపి స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేయవచ్చునని నిపుణులు కూడా సూచిస్తూ ఉంటారు.
 
కిసాన్ వికాస్ పత్రం స్కీమ్‌లో డబ్బులు పెడితే నూట ఇరవై నాలుగు నెలల్లో మీ డబ్బులు రెట్టింపు అవుతాయి. ఇక ఈ స్కీమ్‌లో భాగంగా 6.9 శాతం వడ్డీ లభిస్తోంది. అయితే ఈ స్కీమ్‌లో భాగంగా ఎవరైనా సరే ఒకేసారి 5 లక్షల వరకు ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. 
 
మెచ్యూరిటీ సమయానికి మీరు ఎంత మొత్తం అయితే డబ్బులు పెట్టుబడి పెట్టారో అంత మొత్తం డబ్బులు రెట్టింపు అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఒక లక్ష ఇన్వెస్ట్ చేసినప్పుడు మెచ్యూరిటీ కాలం పూర్తయిన తర్వాత రెట్టింపుగా రెండు లక్షలు పొందే అవకాశం ఉంటుంది. ఇది వన్ టైం ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ అనే చెప్పాలి. ఒకసారి డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే మెచ్యూరిటీ కాలం వరకు వేచి చూడాల్సి ఉంటుంది.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments