Webdunia - Bharat's app for daily news and videos

Install App

రియల్ మీ సంచలనం.. రూ.13వేలకు 5జీ స్మార్ట్‌ఫోన్ విడుదల

Webdunia
మంగళవారం, 13 అక్టోబరు 2020 (14:02 IST)
Realme Q2
చైనా స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ రియల్ మీ సంచలనానికి తెరలేపింది. ఇప్పటికే ఎన్నో బడ్జెట్ ఫోన్లను తీసుకొచ్చిన ఈ సంస్థ తాజాగా కేవలం రూ. 13వేలకే 5జీ ఫోన్‌ను ఆవిష్కరించింది. ప్రస్తుతం చైనాలో లాంచ్ అయిన ఈ ఫోన్లు త్వరలో భారత మార్కెట్లోకి రానున్నాయి. 
 
రియల్‌మీ క్యూ2, రియల్‌మీ క్యూ2 ప్రో, రియల్‌మీ క్యూ2ఐ పేరిట ఈ స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేసింది. ఈ మూడు ఫోన్లు 5జీకి సపోర్ట్ చేస్తాయి. రియల్ మీ క్యూ, రియల్ మీ క్యూ2 ప్రోలు రెండు ర్యామ్, స్టోరేజ్ వేరియంట్లలో లభ్యం కానున్నాయి. 
 
రియల్ మీ క్యూ2ఐలో ఒక్క స్టోరేజ్ వేరియంట్‌లో మాత్రమే లభ్యం కానుంది. ఇక ఈ ఫోన్ల ధరల విషయానికి వస్తే.. రియల్‌మీ క్యూ 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,200 ఉండగా.. 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ.15,200గా ఉంది. 
 
రియల్‌మీ క్యూ2 ప్రో 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 1,799 రూ.19,600 ఉండగా.. 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.21,800గా ఉంది. రియల్‌మీ క్యూ2ఐ 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్‌ ధర రూ.13,000గా నిర్ణయించారు. 
 
రియల్ మీ క్యూ2 ఫీచర్లు..
6.4 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్ఈడీ డిస్ ప్లే,
అక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 800యూ ప్రాసెసర్,
48+8+2 మెగా పిక్సెల్ ట్రిపిల్ రేర్ కెమెరా సెటప్,
16 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా,
5000 ఎంఏహెచ్ బ్యాటరీ,
ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments