ఈ-రిక్షాలు, ఈ-కార్ట్‌లతో సహా ఎలక్ట్రిక్ 3-వీలర్ల కోసం వేగవంతమైన ఛార్జింగ్ సొల్యూషన్‌

ఐవీఆర్
మంగళవారం, 18 నవంబరు 2025 (22:48 IST)
భారతదేశంలో ఎలక్ట్రిక్ త్రీ వీలర్లు (e3W), ఎలక్ట్రిక్ టూ వీలర్లు (e2W) తయారీలో అగ్రగామిగా ఉన్న కైనెటిక్ గ్రీన్ ఎనర్జీ అండ్ పవర్ సొల్యూషన్స్ లిమిటెడ్, ఈరోజు వేగవంతమైన ఛార్జింగ్ టెక్నాలజీకి మార్గదర్శి అయిన ఎక్స్‌పోనెంట్ ఎనర్జీతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రకటించింది. భారతదేశ ఎలక్ట్రిక్ మొబిలిటీ రంగంలో ఒక మైలురాయి పురోగతిలో భాగంగా ఈ కంపెనీలు దేశంలో అతిపెద్ద, వేగంగా అభివృద్ధి చెందుతున్న, విస్తృతంగా ఉపయోగించే విభాగమైన ఇ-రిక్షాలు, ఇ-కార్గో కార్ట్‌లు L5 & L3 e3W కేటగిరీ కోసం దేశంలోనే అత్యంత వేగవంతమైన ఛార్జింగ్ సొల్యూషన్‌ను ప్రవేశపెడుతున్నాయి. ఈ భాగస్వామ్యం భారతదేశంలోని పట్టణ, సెమీ అర్బన్ మొబిలిటీ ఆపరేటర్లకు కార్యాచరణ సామర్థ్యం, ఉత్పాదకతను పునర్నిర్వచించటానికి హామీ ఇస్తుంది.
 
ఈ భాగస్వామ్యం కింద కైనెటిక్ గ్రీన్ ప్రసిద్ధ L3 మోడల్‌లు- సఫర్ స్మార్ట్, సఫర్ శక్తి, సూపర్ DX- ఇప్పుడు 15 నిమిషాల వేగవంతమైన ఛార్జింగ్ టెక్నాలజీని కలిగి ఉన్నాయి. ఇది చిన్న విరామాలలో త్వరిత రీఛార్జ్‌లకు వీలు కల్పిస్తుంది. రోజువారీ ఆపరేటింగ్ గంటలను 30 శాతం వరకు పొడిగిస్తుంది. L5 కేటగిరీలోని హై-స్పీడ్ పెర్ఫార్మెన్స్ లాజిస్టిక్స్ వాహనం అయిన L5N సఫర్ జంబో లోడర్ అసాధారణమైన పేలోడ్, రేంజ్‌కు ప్రసిద్ధి చెందింది. 15 నిమిషాల ఛార్జింగ్ ద్వారా వేగవంతమైన టర్న్‌అరౌండ్ సమయాలను అందిస్తుంది. ఇది వ్యక్తిగత యజమానులు-ఆపరేటర్లు, ఫ్లీట్ ఆపరేటర్‌లకు నేరుగా మరిన్ని ట్రిప్పులు, అధిక ఆదాయాలు, మెరుగైన రాబడికి దారితీస్తుంది. అదేవిధంగా, రాబోయే L5M ప్యాసింజర్ వేరియంట్, గంటకు 50 కి.మీ వరకు వేగాన్ని అందించగలదు. ఇది సుదీర్ఘమైన ఇంటర్‌సిటీ మార్గాల కోసం రూపొందిం చబడింది. రోజువారీ వినియోగాన్ని పెంచడానికి ఈ అధునాతన ఛార్జింగ్ సాంకేతికతను కూడా అవలంబిస్తుంది.
 
అత్యాధునిక బ్యాటరీ టెక్నాలజీ, స్మార్ట్ ఛార్జింగ్ నెట్‌వర్క్, ఇంటెలిజెంట్ సాఫ్ట్‌వేర్‌లను కలిగి ఉండే ఎక్స్‌పోనెంట్ ఎనర్జీ ప్రొప్రైటరీ ఫుల్-స్టాక్ ప్లాట్‌ఫామ్ కైనెటిక్ గ్రీన్ వాహనాలకు 15 నిమిషాల వేగవంతమైన ఛార్జింగ్‌ను, ప్రాపర్టీ జీవితకాల విలువను పెంచేవిధంగా పరిశ్రమలో అగ్రగామిగా ఉన్న 3000-సైకిల్ వారంటీని అందిస్తుంది. ఎక్స్‌పోనెంట్ యొక్క పెరుగుతున్న ఛార్జింగ్ నెట్‌వర్క్‌లో సజావైన ఛార్జింగ్ కోసం ఉమ్మడి పరిష్కారం రూపొందించబడింది. ఇది ఇంటిగ్రేటెడ్ డిజిటల్ ప్లాట్‌ఫామ్ రియల్ టైమ్ స్టేట్ ఆఫ్ ఛార్జ్ ట్రాకింగ్, ప్రిడిక్టివ్ మెయింటెనెన్స్ అలర్ట్‌లు, ఫ్లీట్ ఆప్టిమైజేషన్ కోసం డేటా అనలిటిక్స్‌ను అందిస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మిడి రవిని ఎన్‌కౌంటర్ చేయాలి : నిర్మాత సి.కళ్యాణ్

నా సినిమాలు రీచ్ కాలేదు, త్వరలో డైరెక్షన్ చేస్తా : రాజ్ తరుణ్

ట్రెండ్ సెట్టింగ్ సైన్స్ ఫిక్షన్ మూవీగా కిల్లర్ సర్ ప్రైజ్ చేస్తుంది - డైరెక్టర్ పూర్వజ్

Rajamouli Contravarcy: హనుమంతుడిపై వ్యాఖ్యాలకు, వారణాసి టైటిల్ పై రాజమౌళి కు చెక్కెదురు

సంతాన ప్రాప్తిరస్తు రెస్పాన్స్ తో హ్యాపీగా ఉన్నాం - మధుర శ్రీధర్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments