Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

2 కోట్ల షాపర్స్‌కు చేరిన అమేజాన్ క్రియేటర్ ప్రోగ్రామ్స్

Advertiesment
Amazon

ఐవీఆర్

, మంగళవారం, 18 నవంబరు 2025 (18:58 IST)
ఈ ఏడాది 2 కోట్లకు పైగా షాపర్స్ కోసం తమ క్రియేటర్ ప్రోగ్రాంస్ క్రియేటర్, ఆధారిత ఆవిష్కరణను ప్రోత్సహించాయని అమేజాన్ ఇండియా ప్రకటించింది. పండగ సీజన్‌కు ముందు 1 లక్ష క్రియేటర్ల నుండి ఈరోజు 1.25 లక్షల క్రియేటర్ల వరకు అమేజాన్ వారి క్రియేటర్ ప్రోగ్రాంస్ కొన్ని నెలల్లోనే 25 శాతం పెరిగాయి. క్రియేటర్ ఆధ్వర్యంలోని ఔత్సాహికతలో పెరుగుతున్న మార్కెట్ ప్రదేశం యొక్క బాధ్యతను సూచిస్తోంది. సుమారు 70 శాతం క్రియేటర్-ఆధ్వర్యంలోని కొనుగోళ్లు ఇప్పుడు కర్నాల్, భువనేశ్వర్, విజయవాడ, డెహ్రాడూన్ వంటి నాన్-మెట్రోస్ నగరాల నుండి వచ్చాయి. అమేజాన్ వారి క్రియేటర్లలో మూడింట రెండు వంతులకు పైగా క్రియేటర్లు 500 నాన్-మెట్రో పిన్ కోడ్స్ నుండి వచ్చారు. ఇది క్రియేటర్ వర్తకం, భారతదేశంవ్యాప్తంగా ప్రాంతీయ క్రియేటర్ల  విస్తరిస్తున్న ప్రభావాన్ని సూచిస్తోంది.
 
ఈ పండగ సీజన్లో, 40 లక్షల కంటే ఎక్కువ కస్టమర్లు లైఫ్‌స్టైల్, ఎలక్ట్రానిక్స్, బ్యూటీ, హోమ్ శ్రేణుల్లో క్రియేటర్లు ద్వారా ఉత్పత్తులను కనుగొన్నారు. వినోదం, వర్తకం మధ్య అంతరాన్ని క్రియేటర్లు తగ్గించిన కారణంగా ఈ శక్తివంతమైన ఆకర్షణ ఈ శ్రేణులకు లభించింది. టెక్నాలజీ, ఫ్యాషన్, లైఫ్ స్టైల్, ఫిట్ నెస్, పేరెంటింగ్, ఇంకా ఎన్నో వాటిలో అమేజాన్ ఇన్‌ఫ్లూయెన్సర్ ప్రోగ్రాం 1.25 లక్షల కంటే ఎక్కువమంది క్రియేటర్లను కలిగి ఉంది. ఈ కార్యక్రమం క్రియేటర్లు తమ ప్రేక్షకులతో ప్రామాణికంగా పాల్గొనడాన్ని పెంచుకుంటూ, సంపాదకీయ స్వేచ్ఛతో అనుకూలంగా చేయబడిన అనుబంధ కంటెంట్‌ను రూపొందించడం ద్వారా వారి సృజనాత్మక దృష్టిని కొనసాగించడానికి వీలు కల్పిస్తుంది. ఇంకా, వ్యక్తిగత స్టోర్ ఫ్రంట్స్‌ను రూపొందించడానికి, భారతదేశంవ్యాప్తంగా ఉన్న కస్టమర్లకు అనుగుణంగా ఉండే ఇంటరాక్టివ్ షాపింగ్ అనుభవాలను అందించడానికి క్రియేటర్లకు సాధికారత కల్పించే ఫ్యాషన్ ఇన్ ఫ్లూయెన్సర్ ప్రోగ్రాం, ఇటీవల పరిచయం చేసిన టెక్ ఇన్‌ఫ్లూయెన్సర్ ప్రోగ్రాం వంటి ప్రత్యేకమైన అంశాలు కూడా ఉన్నాయి.
 
అమెజాన్ ఉత్పత్తులు చూపించడం, కస్టమర్ ప్రశ్నలకు జవాబులు ఇవ్వడం, పరిమిత అవధి డీల్స్ అందించడం, అవగాహనతో కూడిన నిర్ణయాలు చేయడంలో కస్టమర్లకు సహాయపడే కంటెంట్ క్రియేటర్లతో కస్టమర్లు నేరుగా చర్చించే విలక్షణమైన లైవ్ షాపింగ్ కార్యక్రమం అమేజాన్ లైవ్ వంటి ఇంటరాక్టివ్ రూపాలు ఉన్నాయి. కేవలం 30 రోజుల్లో, కస్టమర్లు రికార్డ్ స్థాయిలో 43 మిలియన్ నిముషాలు క్రియేటర్ల ఆధ్వర్యంలోని కంటెంట్‌ను అమెజాన్ పైన చూసారు.
 
భారతదేశం ఏ విధంగా కొనుగోళ్లు చేస్తోంది. క్రియేటర్లు పునః నిర్వచిస్తున్నారు, నేడు కస్టమర్లు ఉత్పత్తులను ఎలా కనుగొంటారు, పరిశోధిస్తారు. కొనుగోలు చేస్తారు అనే దానిలో వారు కీలకమైన బాధ్యతవహిస్తున్నారు. అమేజాన్ ఇన్‌ఫ్లూయెన్సర్ ప్రోగ్రాం, అమేజాన్ లైవ్-షాపింగ్ వీడియోస్ వంటి అమేజాన్ క్రియేటర్ ప్రోగ్రాంస్ ద్వారా, దేశంలో ప్రతి మూల ఉన్న కథలు చెప్పేవారి అభిరుచిని ఔత్సాహికతలోకి మేము మార్చడానికి మేము వారికి సాధికారత కల్పిస్తున్నాం. క్రియేటర్ ఆధ్వర్యంలోని ఆవిష్కరణ ఇకామర్స్‌ని పరివర్తనం చేస్తోందని ఈ ఏడాది వృద్ధి నిరూపించింది. కొనుగోళ్లను మరింత ప్రామాణికతగా, ఇంటరాక్టివ్‌గా, దేశంలో నలుమూలల ఉన్న కస్టమర్లకు అందుబాటులో ఉండేలా చేస్తోంది. మా క్రియేటర్ ప్రోగ్రాంస్ ద్వారా, మేము భారతదేశపు వేగంగా పెరుగుతున్న క్రియేటర్ ఆర్థిక వ్యవస్థను సమర్థవంతం చేయడం కొనసాగిస్తాం అని జహీద్ ఖాన్, డైరెక్టర్, షాపింగ్ ఎక్స్‌పీరియెన్స్, అమేజాన్ ఇండియా అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఐషర్‌ప్రో ఎక్స్ డీజిల్ శ్రేణిని విడుదల చేసిన ఐషర్ ట్రక్స్ అండ్ బసెస్