హిడ్మా తల్లితో భోజనం చేసిన ఛత్తీస్‌గఢ్ ఉప ముఖ్యమంత్రి.. వారం రోజుల్లో హిడ్మా హతం

ఠాగూర్
మంగళవారం, 18 నవంబరు 2025 (22:38 IST)
మావోయిస్టు అగ్రనేత మడ్వి హిడ్మా హతమయ్యారు. ఏపీలోని అల్లూరు సీతారామరాజు జిల్లా మారేడుపల్లి అటవీ ప్రాంతంలో మంగళవారం మావోలకు భద్రతా బలగాల మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో హిడ్మాతో ఆరుగురు నక్సలైట్లు హతమయ్యారు. ఇటీవల హిడ్మాను లొంగిపోవాలని ఛత్తీస్‌గఢ్ ఉప ముఖ్యమంత్రి విజయ్ శర్మ స్వయంగా ఆయన తల్లితో కలిసి భోజనం చేసిన సరిగ్గా 8 రోజులకే భద్రతా బలగాల చేతిలో హిడ్మా హతమయ్యాడు. ఇది మావోయిస్టు ఉద్యమానికి పెద్ద గట్టి ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. 
 
మారేడుపల్లి అటవీ ప్రాంతంలో మంగళవారం ఉదయం జరిగిన భారీ ఎన్‌కౌంటరులో మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు, సెంట్రల్ కమిటీ సభ్యుడు మడ్వి హిడ్మా, అతని భార్య రాజే, నలుగురు గన్‌మెన్లు ప్రాణాలు కోల్పోయినట్టు ఏపీ ఇంటెలిజెన్స్ అదనపు డీజీ మహేశ్ చంద్ర లడ్డా మీడియాకు వెల్లడించారు. 
 
ఈ ఎన్‌కౌంటర్‌కు అంటే సరిగ్గా 8 రోజులకు ముందు అంటే నవంబరు 10వ తేదీన ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం విజయ్ శర్మ మావోస్టుల కంచుకోట అయిన సుక్మా జిల్లాలోని పూవర్తి గ్రామానికి భారీ బందోబస్తు నడమ వెళ్లారు. అక్కడ హిడ్మా తల్లిని కలిసి ఆమెతో కలిసి భోజనం చేశారు. 
 
తన కుమారుడిని లొంగిపోయేలా ఒప్పించాలని ఆయన ఆమెను అభ్యర్థించారు. దీనికి ఆమె కూడా సానుకూలంగా స్పందించారు. తన కుమారుడు లొంగిపోయేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. ఇంతలోనే అంటే 8 రోజుల తర్వాత జరిగిన ఎన్‌కౌంటరులో హిడ్మా, ఆయన సతీమణి ప్రాణాలు విడిచారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మిడి రవిని ఎన్‌కౌంటర్ చేయాలి : నిర్మాత సి.కళ్యాణ్

నా సినిమాలు రీచ్ కాలేదు, త్వరలో డైరెక్షన్ చేస్తా : రాజ్ తరుణ్

ట్రెండ్ సెట్టింగ్ సైన్స్ ఫిక్షన్ మూవీగా కిల్లర్ సర్ ప్రైజ్ చేస్తుంది - డైరెక్టర్ పూర్వజ్

Rajamouli Contravarcy: హనుమంతుడిపై వ్యాఖ్యాలకు, వారణాసి టైటిల్ పై రాజమౌళి కు చెక్కెదురు

సంతాన ప్రాప్తిరస్తు రెస్పాన్స్ తో హ్యాపీగా ఉన్నాం - మధుర శ్రీధర్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments