Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Sania Mirza: ఒంటరి తల్లి నా కుమారుడిని పెంచడం చాలా చాలా కష్టం : సానియా మీర్జా (video)

Advertiesment
Sania_Farah Khan

సెల్వి

, గురువారం, 13 నవంబరు 2025 (11:31 IST)
Sania_Farah Khan
ఒంటరి తల్లి జీవితం కష్టమని భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా స్పష్టం చేసింది. తన ఆప్తమిత్రురాలు, బాలీవుడ్ దర్శకురాలు ఫరా ఖాన్‌తో కలిసి నిర్వహించిన పాడ్‌కాస్ట్‌లో సానియా మీర్జా మాట్లాడుతూ.. తన జీవితంలో ఎదుర్కొన్న తీవ్రమైన ఒత్తిడి గురించి గుర్తుచేసుకుంది. ఒకసారి తనకు పానిక్ అటాక్ వచ్చినప్పుడు, ఫరా ఖాన్  వచ్చి అండగా నిలిచారని తెలిపింది.
 
ఈ సందర్భంగా తన జీవితంలో ఎదుర్కొన్న తీవ్రమైన ఒత్తిడి గురించి సానియా గుర్తుచేసుకుంది. ఆ రోజు మీరు రాకపోతే నేను ఆ లైవ్ షో చేసేదాన్ని కాదు. నేను వణికిపోతున్నాను.. అని సానియా చెప్పగా, నువ్వు పానిక్ అటాక్‌తో ఉండటం చూసి నేను భయపడ్డాను. షూటింగ్ ఉన్నా పైజమాలోనే పరిగెత్తుకుంటూ వచ్చేశాను.. అని ఫరాఖాన్ ఆ సంఘటనను గుర్తు చేసుకున్నారు. గతంలో తల్లిదండ్రులు విడిపోవడం పెద్ద విషయంగా చూసేవారని, ఇప్పుడు అది సాధారణమైపోయిందని ఫరా పేర్కొన్నారు. 
 
అయితే, ఇది ఎంత సాధారణమైనా పిల్లలపై దాని ప్రభావం కచ్చితంగా ఉంటుందని సానియా అభిప్రాయపడింది. పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌తో విడాకుల తర్వాత తొలిసారి తన వ్యక్తిగత జీవితంలోని కష్టాల గురించి బహిరంగంగా మాట్లాడింది. ఒంటరి తల్లిగా తన కుమారుడిని పెంచడం చాలా చాలా కష్టం అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారత్-దక్షిణాఫ్రికా టెస్ట్ క్రికెట్: హోటల్, ప్రాక్టీస్ వేదికల వద్ద పటిష్ట భద్రత