Webdunia - Bharat's app for daily news and videos

Install App

సిద్స్‌ ఫార్మ్‌తో డెయిరీ ఫార్మింగ్‌ను ఆస్వాదించిన చిన్నారులు

Webdunia
శనివారం, 19 నవంబరు 2022 (21:13 IST)
తెలంగాణా కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న సుప్రసిద్ధ డీ2సీ డెయిరీ బ్రాండ్‌ సిద్స్‌ ఫార్మ్‌, చేవెళ్లలోని తమ ఫార్మ్‌ వద్ద చిన్నారులకు డెయిరీ ఫార్మింగ్‌ పట్ల ఓ అవగహన కార్యక్రమం నిర్వహించింది. దాదాపు 70 మంది చిన్నారులు ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవడంతో పాటుగా డెయిరీ ఫార్మింగ్‌లో కీలకాంశాలను గురించి తెలుసుకున్నారు. మొట్టమొదటిసారిగా డెయిరీ ఫార్మ్‌కు వచ్చిన చిన్నారులు పూర్తి ఉత్సాహం, ఆసక్తితో పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు. సిద్స్‌ ఫార్మ్‌ ఫౌండర్‌ డాక్టర్‌ కిశోర్‌ ఇందుకూరి వ్యక్తిగతంగా ఈ చిన్నారులను కలుసుకోవడంతో పాటుగా క్యాంపస్‌ మొత్తం  చూపించి, డెయిరీ ఫార్మింగ్‌లో ఉన్న లాభనష్టాలను గురించి వివరించారు.
 
ఈ సందర్భంగా సిద్స్‌ ఫార్మ్‌ ఫౌండర్‌ డాక్టర్‌ కిశోర్‌ ఇందుకూరి మాట్లాడుతూ, ‘‘చిన్నారులతో మమేకం కావడం అద్వితీయమైన  అనుభవాలను మిగిల్చింది. ఫార్మ్‌లో పలు కార్యక్రమాలలో వారు ఉత్సాహంగా పాల్గొనడంతో పాటుగా తెలివైన ప్రశ్నలనూ సంధించారు. పాల పరీక్షలు మొదలుకుని పాలలో కల్తీ, యాంటీబయాటిక్స్‌ తొలిగింపుకు అనుసరించే మార్గాలను గురించి వారు అడిగి తెలుసుకున్న తీరు స్ఫూర్తిదాయకం. ఇతర పాలతో పోలిస్తే సిద్స్‌ ఫార్మ్‌ పాలు ఎందుకు  విభిన్నమని వారు తెలుసుకున్న తీరు అమోఘం’’ అని అన్నారు
 
హైదరాబాద్‌ వాల్ర్డోఫ్‌ స్కూల్‌, శ్లోకకు చెందిన విద్యార్ధులు ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. 2016లో ప్రారంభమైన సిద్స్‌ ఫార్మ్‌ తమ కుటుంబాలు, కమ్యూనిటీలకు తాజా ఆవు, గేదె పాలతో పాటుగా పాల ఉత్పత్తులను సైతం యాంటీబయాటిక్స్‌, నిల్వకారకాలు లేదా సింథ  టిక్‌ హార్మోన్లు లేకుండా అందిస్తుంది. భావి తరానికి కల్తీ లేని పాల గురించి అవగాహన కల్పించడంతో పాటుగా మనం వినియోగించే పాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఆ పాలతో మనకు లభించే ప్రయోజనాలు తెలిపేందుకు ఈ తరహా కార్యక్రమాలను సిద్స్‌ ఫార్మ్‌ నిర్వహిస్తుంది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

chiru: చిరంజీవి విశ్వంభర నుంచి ఫస్ట్ సింగిల్ రామ రామ సాంగ్ పోస్టర్ రిలీజ్

Jack review: సిద్ధు జొన్నలగడ్డ జాక్ చిత్రం ఎలావుందంటే.. జాక్ రివ్యూ

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

తర్వాతి కథనం
Show comments