ఐటీ రిటర్నుల దాఖలు గడువు ముగిసింది.. చివరి రోజున..

Webdunia
సోమవారం, 1 ఆగస్టు 2022 (10:11 IST)
2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆదాయపు పన్ను రిటర్నుల (ఐటీఆర్‌) దాఖలుకు ఆఖరి రోజైన ఆదివారం ఒక్కరోజులోనే రాత్రి 11 గంటల వరకు 67,97,067 రిటర్నులు దాఖలైనట్లు ఆదాయ పన్ను విభాగం వెల్లడించింది. 
 
శనివారం వరకు 5.10 కోట్లకు పైగా దాఖలైన విషయం తెలిసిందే. ఆదివారం రాత్రి 12 గంటల సమయానికి దాదాపు 5.83 కోట్ల ఐటీఆర్‌లు దాఖలైనట్టు సమాచారం. 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి, పొడిగించిన గడువు తేదీ 2021 డిసెంబరు 31 వరకు చూస్తే దాదాపు 5.89 కోట్ల ఐటీఆర్‌లు దాఖలయ్యాయి. 
 
అంటే గతేడాదితో పోలిస్తే ఈసారి గడువు పొడిగించనందున 6 లక్షల మంది జరిమానాతో ఐటీఆర్‌ దాఖలు చేయాల్సి వస్తుంది. ఆదివారం ఉదయం నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు 19.53 లక్షలు దాఖలయ్యాయి. తదుపరి ప్రతి గంటకు 4 లక్షలకు పైగా.. సాయంత్రం 5-6 గంటల మధ్య అత్యధికంగా 5.17 లక్షల ఐటీఆర్‌లు దాఖలయ్యాయి.
 
మరోవైపు, 2021-22కు సంబంధించి అపరాధ రుసుము లేకుండా జులై 31లోగా ఐటీఆర్‌లు దాఖలు చేయాలి. తదుపరి డిసెంబరు 31 వరకు అపరాధరుసుముతో దాఖలు చేయొచ్చు. రూ.5 లక్షల లోపు ఆదాయం ఉన్న వారు రూ.1000, అంతకుమించిన ఆదాయం గలవారు రూ.5000 చొప్పున అపరాధ రుసుము చెల్లించి, ఐటీఆర్‌ దాఖలు చేసుకునే వెసులుబాటును కల్పించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prerna Arora: ఆరెంజ్ స్పూర్తితో తెలుగు సినిమా చేశా - జటాధర బ్లాక్ మ్యాజిక్ కథ : నిర్మాత ప్రేరణ అరోరా

Aadi Saikumar: శంబాల ఏ ఒక్కరినీ నిరాశపర్చదు : ఆది సాయికుమార్

సింగర్ రామ్ మిరియాల పాడిన టైటిల్ సాంగ్ సంతాన ప్రాప్తిరస్తు

Mahesh Chandra: పిఠాపురంలో అలా మొదలైంది అంటోన్న దర్శకుడు మహేష్‌చంద్ర

Mammootty: 55వ కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డులలో మెరిసిన మమ్ముట్టి భ్రమయుగం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

తర్వాతి కథనం
Show comments