Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐసీఐసీఐ ఫ్రుడెన్షియల్‌ లైఫ్‌ నుంచి మెరుగైన పెన్షన్‌ పరిష్కారం

Webdunia
గురువారం, 2 డిశెంబరు 2021 (22:48 IST)
రిటైర్‌మెంట్‌ తరువాత కూడా పెరుగుతున్న జీవన వ్యయాలకనుగుణంగా వినియోగదారులు క్రమం తప్పకుండా ఆదాయం పొందడంలో సహాయపపడేందుకు ఐసీఐసీఐ ఫ్రుడెన్షియల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ ఇప్పుడు వినూత్నమైన రిటైర్‌మెంట్‌ పరిష్కారాన్ని గ్యారెంటీడ్‌ పెన్షన్‌ ప్లాన్‌ యొక్క ఇమ్మీడియట్‌ (తక్షణ) మరియు వాయిదా వేయబడిన వార్షిక అవకాశాల(డిఫర్డ్‌ యాన్యుటీ ఆప్షన్‌)ను మిళితం చేసి అందిస్తుంది. వృద్ధి చెందుతున్న జీవన వ్యయాల సవాళ్లకు తగిన పరిష్కారం చూపుతూనే ఖచ్చితమైన రీతిలో క్రమం తప్పని ఆదాయాన్ని వినియోగదారులకు అందించే వినూత్న పరిష్కారమిది.
 
వృద్ధి చెందుతున్న ద్రవ్యోల్భణంకు తోడు సూక్ష్మ కుటుంబాలు పెరుగుతుండటం చేత, చిన్నారులు తమ కెరీర్‌ అవకాశాలను వెదుక్కుంటూ విదేశాలకు వలసపోతున్నారు. ఈ కారణంగా రిటైర్‌ అయిన వ్యక్తులకు పొదుపు సొమ్ము తరిగిపోవడం లేదంటే ఆర్ధిక భద్రత లేకపోవడం వంటి ప్రమాదాలూ ఉన్నాయి.
 
‘‘గ్యారెంటీడ్‌ పెన్షన్‌ ప్లాన్‌ అనేది వార్షిక ఉత్పత్తి. ఇది తక్షణ మరియు వాయిదా వేసిన వార్షిక ఎంపికలను సైతం అందిస్తుంది. ఇమ్మీడియట్‌ యాన్యువిటీ వినియోగదారులు గ్యారెంటీడ్‌ రెగ్యులర్‌ ఆదాయాన్ని కొనుగోలుచేసిన వెంటనే పొందగలరు. మరోవైపు వాయిదా వేసిన యాన్యుటీ వినియోగదారులు భవిష్యత్‌లో అంటే రిటైర్‌మెంట్‌కు దగ్గరలో ఉన్నప్పటి నుంచి ఆదాయం పొందగలరు. వినియోగదారులు 10 సంవత్సరాల తరువాత నుంచి ఆదాయం పొందేందుకు తగిన అవకాశాలను ఎంచుకోవచ్చు. సుదీర్ఘకాలం వాయిదా వేయడం వల్ల అధిక మొత్తాలను సైతం వారు అందుకోగలరు. ఈ రెండు అవకాశాలలోనూ వడ్డీరేటును  కొనుగోలు చేసిన సమయంలో  లాక్‌ ఇన్‌ కాలానికనుగుణంగా అందిస్తారు.
 
ఐసీఐసీఐ ఫ్రుడెన్షియల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ లిమిటెడ్‌ హెడ్‌ ఆఫ్‌ ప్రొడక్ట్స్‌  శ్రీ బీ శ్రీనివాస్‌ మాట్లాడుతూ, ‘‘కోవిడ్‌ –19 కారణంగా ఎన్నో జీవితాలు అంతం కావడం మాత్రమే కాదు మరెంతో మంది జీవనోపాధి కోల్పోయారు. ఆర్ధిక ప్రణాళికల ఆవశ్యతను ఇది వినియోగదారులకు తెలిపింది. అదే సమయంలో రిటైర్‌మెంట్‌ ప్రణాళికల పట్ల ప్రత్యేక దృష్టి సారించే అవకాశమూ కల్పించింది. ఈ గ్యారెంటీడ్‌ పెన్షన్‌ ప్లాన్‌ తమ వినియోగదారులకు జీవితాంతం క్రమం తప్పకుండా ఆదాయం అందిస్తుంది. గ్యారెంటీడ్‌ పెన్షన్‌ ప్లాన్‌ను ప్రొడక్ట్‌ ఆఫ్‌ ద ఇయర్‌2021గా గుర్తించారు. ఇది ఈ ఉత్పత్తి యొక్క ప్రాచుర్యంను వెల్లడిస్తుంది’’ అని అన్నారు.
 
శ్రీ శ్రీనివాస్‌ మరింతగా మాట్లాడుతూ, ‘‘పెరుగుతున్న జీవన వ్యయం పట్ల వినియోగదారుల ఆందోళనలను పరిష్కరించేందుకు మేము వినూత్నమైన రిటైర్‌మెంట్‌ పరిష్కారాన్ని ఇమ్మీడియట్‌ మరియు డిఫర్డ్‌ యాన్యుటీగా అందిస్తున్నాం. ఇది వినియోగదారులకు 5వ సంవత్సరం తరువాత రిటైర్‌మెంట్‌ ఆదాయం రెట్టింపు చేసే అవకాశం ఎంచుకునేందుకు వీలు కల్పించడంతో పాటుగా 11వ సంవత్సరం తరువాత దానిని మూడు రెట్లుపెంచుకునే వీలు కూడా కల్పిస్తుంది. ఇది వినియోగదారులకు ద్రవ్యోల్భణ  ప్రభావాన్ని ధైర్యంగా ఎదుర్కొనే శక్తిని సైతం అందిస్తుంది’’ అని అన్నారు.
 
పరిశ్రమలో తొలిసారిగా చెప్పబడుతున్న ఫీచర్లను ఇది అందిస్తుంది. వీటిలో  కొనుగోలు ధర తిరిగి చెల్లించడం ఒకటి.  దీనిలో భాగంగా ఒకవేళ పాలసీదారునికి నిర్ధిష్టమైన తీవ్ర అనారోగ్యం లేదా శాశ్వత అంగవైకల్యంను పొందితే కొనుగోలు ధర తిరిగి చెల్లిస్తారు. రిటైర్‌ అయిన వ్యక్తులు స్ధిరంగా ఆదాయం పొందాలని కోరుకుంటారు. మరీ ముఖ్యంగా పెరుగుతున్న ద్రవ్యోల్భణానికి తగినట్లుగా ఈ ఆదాయం ఉండాలని కోరుకుంటారు. రిటైర్‌మెంట్‌ ఆదాయం సురక్షితంగా పొందేందుకు అద్భుతమైన ఉపకరణాలుగా యాన్యుటీ ఉత్పత్తులు నిలుస్తుంటాయి. వీటిని ఒకసారి ప్రీమియం చెల్లించడం ద్వారా కొనుగోలు చేయవచ్చు. తద్వారా వినియోగదారులు ఆర్ధిక స్వేచ్ఛనూ పొందగలరు. ఉమ్మడి జీవిత యాన్యుటీ అవకాశాలను సైతం ఎంచుకోవడం ద్వారా గ్యారెంటీడ్‌ రెగ్యులర్‌ ఆదాయంను ప్రైమరీ పాలసీహోల్డర్‌ మరణించిన ఎడల భార్య/భర్తకు అందజేస్తారు. తద్వారా వారికి ఆర్ధిక భద్రతను అందిస్తారు. ఒకవేళ పాలసీహోల్డర్లు ఇరువురూ మరణిస్తే, కొనుగోలు ధరను నామినీకి చెల్లిస్తారు.
 
వృత్తిపరంగా నైపుణ్యం ప్రదర్శించాలన్న తపన కారణంగా చాలామంది తమ వయసు మళ్లిన తల్లిదండ్రులను ఇక్కడ వదిలి విదేశాలకు వెళ్లిపోతున్నారు. తల్లిదండ్రులు ఆర్ధిక భద్రతకు భరోసా కల్పించేందుకు, పిల్లలే ఈ ప్రొడక్ట్‌ను కొనుగోలు చేయడం ద్వారా తమ  తల్లిదండ్రులకు క్రమం తప్పకుండా ఆదాయం అందించవచ్చు. వారి ఆర్ధిక అవసరాలు తీర్చబడుతున్నాయని తెలుసుకోవడం మనశ్శాంతిని పొందేందుకు ఓ అద్భుతమైన మార్గం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతుందా? సైరా లాయర్ ఏమన్నారు?

సమంత ఇంట్లో విషాదం... 'మనం మళ్లీ కలిసే వరకు, నాన్న' ...

నాగ చైతన్య- శోభితా ధూళిపాళ వివాహం.. ఇద్దరి మధ్య ఏజ్ గ్యాపెంత?

మా పెళ్లి వచ్చే నెలలో గోవాలో జరుగుతుంది : కీర్తి సురేష్ (Video)

అజిత్ కుమార్ విడాముయర్చి టీజర్ ఎలా వుంది?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments