Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కిసాన్‌ రైళ్ల తాత్కాలిక నిలుపుదల

కిసాన్‌ రైళ్ల తాత్కాలిక నిలుపుదల
, గురువారం, 11 నవంబరు 2021 (11:04 IST)
కిసాన్‌, స్పెషల్‌ గూడ్స్‌ రైళ్లను తాత్కాలికంగా నిలుపుదల చేశారు. వారం రోజులపాటు విశాఖపట్నం వైపు వెళ్లేందుకు వీటికి అనుమతి లేదు. తూర్పుకోస్తా రైల్వే ప్రాంతమైన భద్రక్‌, ఒడిశాల నుంచి విజయవాడ థర్మల్‌ పవర్‌స్టేషన్‌కు బొగ్గు దిగుమతి చేస్తున్నారు.

ఈ క్రమంలో ఆయా మార్గాల ట్రాక్‌లు రద్దీగా మారాయి. ఇప్పటికే బయలుదేరిన గూడ్స్‌ రైళ్లను తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమహేంద్రవరం ప్రాంతాల్లో గంటలకొద్దీ నిలిపివేస్తున్నారు.

ముడిఇనుము, సున్నపు రాయి వ్యాగన్లతో ఉన్న గూడ్స్‌ బండి ఆదివారం ఉదయం ఏలూరు వచ్చినా సాయంత్రానికీ కొవ్వూరు రోడ్డు-రైలు వంతెనను దాటలేదు. బొగ్గు వ్యాగన్ల రద్దీని తట్టుకునేందుకు మూడేసి గూడ్స్‌ రైళ్లను ఒక్కటిగా చేసి నడుపుతున్నారు.
 
నిలిచిన ఉల్లి, కోడిగుడ్ల ఎగుమతులు
తాడేపల్లిగూడెం రైల్వేస్టేషన్‌ నుంచి ఇటీవల ఒడిశా, అసోం, నాగాలాండ్‌ ప్రాంతాలకు ఉల్లి, కోడిగుడ్లను ఎగుమతి చేస్తున్నారు. ప్రతి ఆదివారం ప్రత్యేకరైళ్లలో నాగాలాండ్‌, దీమాపూర్‌ ప్రాంతాలకు సుమారు 40 లక్షల కోడిగుడ్లు ఎగుమతి చేస్తారు.

ప్రస్తుతం ఉల్లి సీజన్‌ కావడంతో కర్నూలు నుంచి తాడేపల్లిగూడెం మార్కెట్‌కు దిగుమతి చేసుకున్న సరకును కిసాన్‌ రైళ్లలో ఈశాన్య రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు. పార్శిల్‌ రైళ్ల నిలుపుదలతో కర్నూలు ఉల్లికి గిట్టుబాటు ధర రావడం లేదని రైతులు వాపోతున్నారు. కోడిగుడ్లను గిడ్డంగుల్లో నిల్వచేసిన వ్యాపారులు అవి పాడవుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సాయంత్రం కడలూరు సమీపాన తుపాను తీరాన్ని దాటే అవకాశం