Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫండ్‌ మేనేజ్‌మెంట్‌ బృందాన్ని బలోపేతం చేసుకున్న ఐడీఎఫ్‌సీ ఏఎంసీ

Webdunia
శుక్రవారం, 3 డిశెంబరు 2021 (23:12 IST)
ఐడీఎఫ్‌సీ ఎస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ (ఏఎంసీ) లిమిటెడ్‌, తమ సీనియర్‌ ఫండ్‌ మేనేజర్‌గా శ్రీ గౌతమ్‌ కౌల్‌ను ఫిక్స్‌డ్‌ ఇన్‌కమ్‌ ఫండ్‌ మేనేజ్‌మెంట్‌ బృందంలో తీసుకున్నట్లు వెల్లడించింది. శ్రీ కౌల్‌కు 20 సంవంత్సరాలకు పైగా అనుభవం ఫిక్స్‌డ్‌ ఇన్‌కమ్‌ వ్యూహాలలో ఉంది. గతంలో ఆయన 27 వేల కోట్ల రూపాయల ఆస్తులను యాక్టివ్‌, పాసివ్‌ వ్యూహాల వ్యాప్తంగా నిర్వహించారు. శ్రీ  కౌల్‌ బీకామ్‌, అనంతరం ఎంబీఏ చేసి సుప్రసిద్ధ ఎస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీలతో పాటుగా సుప్రసిద్ధ సెక్యూరిటీస్‌ సంస్థలలోనూ పలు బాధ్యతలను నిర్వర్తించారు.
 
సుయాష్‌ చౌదరి, హెడ్- ఫిక్స్‌డ్‌ ఇన్‌కమ్‌, ఐడీఎఫ్‌సీ ఏఎంసీ మాట్లాడుతూ, ‘‘ఐడీఎఫ్‌సీ ఏఎంసీ ఫ్యామిలీకి గౌతమ్‌ను సాదరంగా ఆహ్వానిస్తున్నాము. గత రెండు దశాబ్దాలుగా ఆయన ట్రాక్‌ రికార్డ్‌, మార్కెట్‌ స్దితిగతులకనుగుణంగా చర్యలను తీసుకుంటూ స్ధిరమైన పనితీరు చూపే సామర్ధ్యం వంటివి మా పనితీరుకనుగుణంగా ఉండటం వల్ల ఆయన మా వృద్ధి చెందుతున్న బృందంలో సరిగ్గా సరిపోతారు’’ అని అన్నారు
 
శ్రీ కౌల్‌ ఇప్పుడు ఐడీఎఫ్‌సీ కార్పోరేట్‌ బాండ్‌ ఫండ్‌ మరియు ఐడీఎఫ్‌సీ బ్యాంకింగ్‌, పీఎస్‌యు డెబ్ట్‌ ఫండ్‌లను శ్రీ సుయాష్‌ చౌదరితో కలిసి నిర్వహించనున్నారు. అంతేకాకుండా శ్రీ హర్షల్‌ జోషితో కలిసి ఐటీఎఫ్‌సీ గిల్ట్‌ 2027-2028ను మరియు శ్రీ బ్రిజేష్‌ షాతో కలిసి ఐడీఎఫ్‌సీ మనీ మేనేజర్‌ ఫండ్‌ను సైతం నిర్వహించనున్నారు.
 
ఐడీఎఫ్‌సీ ఏఎంసీ ఇటీవలనే  శ్రీ నేమిష్‌ సేథ్‌ను ఈక్విటీ ఫండ్‌ మేనేజ్‌మెంట్‌ బృందంలో నియమించుకున్నట్లు వెల్లడించింది. దాదాపు 12 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన శ్రీ సేథ్‌, ఐడీఎఫ్‌సీ ఆర్బిట్రేజ్‌ ఫండ్‌, ఐడీఎఫ్‌సీ ఈక్విటీ సేవింగ్స్‌ ఫండ్‌, ఐడీఎఫ్‌సీ సెన్సెక్స్‌ ఈటీఎఫ్‌, ఐడీఎఫ్‌సీ నిఫ్టీ ఈటీఎఫ్‌ నిర్వాహక బృందంలో భాగం కానున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అలాంటి పాత్రలు చేయకూడదని నిర్ణయించుకున్నా : పరుచూరి గోపాలక్రిష్ణ

నయనతార బర్త్‌డే స్పెషల్.. రాక్కాయిగా లేడీ సూపర్ స్టార్

స్టార్ హీరోల ఫంక్షన్ లకు పోటెత్తిన అభిమానం నిజమేనా? స్పెషల్ స్టోరీ

'పుష్ప-2' ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ గ్రాండ్ సక్సస్సేనా?

పెళ్లికి ముందే శోభితా ధూళిపాళ కీలక నిర్ణయం.. ఏంటది?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళల్లో జ్ఞాపకశక్తి పెరగాలంటే.. రోజూ ఓ కోడిగుడ్డు తినాల్సిందేనట

క్యాల్షియం స్థాయిలను వృద్ధి చేసే 6 సహజసిద్ధ పానీయాలు, ఏంటవి?

బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు

తిరుపతిలో తమ మొదటి స్టోర్‌ను ప్రారంభించిన ప్రముఖ లగ్జరీ ఫర్నిచర్ బ్రాండ్ డురియన్

యూరిక్ యాసిడ్ తగ్గించే పండ్లు ఏంటి?

తర్వాతి కథనం
Show comments