Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఐడీఎఫ్‌సీ మ్యూచువల్‌ ఫండ్‌ నుంచి మొట్టమొదటి అంతర్జాతీయ ఫండ్‌

ఐడీఎఫ్‌సీ మ్యూచువల్‌ ఫండ్‌ నుంచి మొట్టమొదటి అంతర్జాతీయ ఫండ్‌
, మంగళవారం, 27 జులై 2021 (22:03 IST)
ఐడీఎఫ్‌సీ మ్యూచువల్‌ ఫండ్‌ తమ మొట్టమొదటి అంతర్జాతీయ ఫండ్‌ ఐడీఎఫ్‌సీ యుఎస్‌ ఈక్విటీ ఫండ్‌ ఆఫ్‌ ఫండ్‌ను విడుదల చేస్తున్నట్లు వెల్లడించింది. ఓపెన్‌ ఎండెడ్‌ ఫండ్‌ ఆఫ్‌ ఫండ్‌ స్కీమ్‌ను విదేశీ మ్యూచువల్‌ ఫండ్‌ స్కీమ్స్‌/యుఎస్‌ ఈక్విటీ సెక్యూరిటీలలో పెట్టుబడులు పెట్టే ఎక్సేంజ్‌ ట్రేటెడ్‌ ఫండ్‌(లు)కు చెందిన యూనిట్లు/షేర్లులో పెట్టుబడి పెట్టడం ద్వారా దీర్ఘకాల మూలధన వృద్ధిని సృష్టించడంపై దృష్టి కేంద్రీకరిస్తారు.
 
యుఎస్‌ స్టాక్స్‌కు చెందిన వృద్ధి లక్ష్యంగా కలిగిన జాబితాలో పెట్టుబడి పెట్టే అవకాశాన్ని మదుపరులకు కల్పించేలా దీనిని డిజైన్‌ చేశారు. ఈ ఫండ్‌ను జె.పీ మోర్గాన్‌ యుఎస్‌ గ్రోత్‌ ఫండ్‌ నిర్వహించనుంది. ఈ నూతన ఫండ్‌ ఆఫర్‌ను గురువారం, జూలై 29వ తేదీన తెరువడంతో పాటుగా  ఆగస్టు 12,2021వ తేదీన మూసివేస్తారు.
 
యుఎస్‌ ఈక్విటీలలో పెట్టుబడి పెట్టే రీతిలో ఐడీఎఫ్‌సీ యుఎస్‌ ఈక్విటీ ఫండ్‌ ఆఫ్‌ ఫండ్స్‌ను ఆవిష్కరించడం గురించి విశాల్‌ కపూర్‌, సీఈవో, ఐడీఎఫ్‌సీ ఎస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ లిమిటెడ్‌ (ఏఎంసీ) మాట్లాడుతూ ‘‘ఓ అంతర్జాతీయ ఫండ్‌ను సైతం జోడించడం వల్ల మదుపరుల పెట్టుబడుల జాబితాకు భౌగోళిక వైవిధ్యీకరణను తీసుకురావడంలో సహాయపడుతుంది.
 
అయితే, ఓ అంతర్జాతీయ ఫండ్‌ను ఎంచుకునే ముందు మదుపరులు, ఒకవేళ తాము పెట్టుబడి పెట్టబోయే ఫండ్‌ కాంప్లిమెంటరీయా అన్నది పరిశీలించాలి. ఐడీఎఫ్‌సీ యుఎస్‌ ఈక్విటీ ఫండ్‌ ఆఫ్‌ ఫండ్‌, భారతీయ ఈక్విటీలతో అతి తక్కువ సంబంధం కలిగి ఉండటం వల్ల ఇన్వెస్టర్ల జాబితాకు కాంప్లిమెంటరీ జోడింపును అందిస్తుంది. అదనంగా, ఇది మదుపరులకు యుఎస్‌ ఈక్విటీలలో పెట్టుబడులు పెట్టేందుకు శక్తివంతమైన అవకాశాన్నీ అందిస్తుంది. విభిన్న మార్కెట్‌ల వ్యాప్తంగా యుఎస్‌ మార్కెట్‌లో నూతన తరపు ఆవిష్కరణలు జరుగుతున్నాయి. ఈ వినూత్న వ్యాపారాల నుంచి మదుపరులు ప్రయోజనం పొందగలరు..’’ అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బసవరాజు బొమ్మైకే బొమ్మ పడింది, కర్నాటక సీఎం కుర్చీ ఆయనదే...