Webdunia - Bharat's app for daily news and videos

Install App

హోటల్స్ - రెస్టారెంట్లలో సర్వీస్ చార్జ్ బాదుడు నుంచి రిలీఫ్

Webdunia
మంగళవారం, 5 జులై 2022 (09:54 IST)
ఇకపై హోటల్స్, రెస్టారెంట్లలో సర్వీస్ చార్జ్ నుంచి వినియగదారులకు ఉపశమనం లభించనుంది. కస్టర్ తినే ఆహార పదార్థాలకు చార్జ్ చేసే బిల్లులో సర్వీస్ చార్జ్ కూడా కలపడాన్ని సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీటీఏ) నిషేధించింది. ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. పైగా, ఈ నిబంధనలకు విరుద్ధంగా సర్వీస్ చార్జిని వసూలు చేస్తే మాత్రం 1915 అనే టోల్ ఫ్రీ నంబరుకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయొచ్చని తెలిపింది. 
 
సర్వీస్ ఛార్జ్ విషయంలో ఇటీవల ఫిర్యాదులు వెల్లువెత్తిన నేపథ్యంలో సీసీపీఏ ఈ మేరకు చర్యలు తీసుకుంది. హోటల్స్, రెస్టారెంట్లు బిల్స్ వేయడంపై స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించింది. కొత్త నిబంధనల ప్రకారం... హోటల్స్ లేదా రెస్టారెంట్స్.. బిల్​లో సర్వీస్ ఛార్జ్​ను ఆటోమెటిక్​గా యాడ్ చేయకూడదు. ఇతర పేర్లతో సర్వీస్​ ఛార్జ్ వసూలు చేయకూడదు.
 
సర్వీస్ ఛార్జ్​ చెల్లించాలని వినియోగదారులపై ఎట్టి పరిస్థితుల్లోనూ ఒత్తిడి చేయరాదు. సేవా రుసుము చెల్లింపు అనేది పూర్తిగా ఐచ్ఛికమని వారికి స్పష్టంగా చెప్పాలి. సర్వీస్​ ఛార్జ్​ చెల్లిస్తారా లేదా అనే విషయం ఆధారంగా వినియోగదారులను హోటల్​ లేదా రెస్టారెంట్​ లోపలకు అనుమతించడం, లేదా వారికి అందించే సేవలపై ఆంక్షలు విధించడం చేయకూడదు.
 
ఫుడ్​ బిల్​తోపాటే సర్వీస్ ఛార్జ్ కూడా విధించి.. ఆ మొత్తంపై జీఎస్​టీ వసూలు చేయడం నిషిద్ధం. నిబంధనలు విరుద్ధంగా ఏదైనా హోటల్​ లేదా రెస్టారెంట్ సర్వీస్ ఛార్జ్ విధించిందని కస్టమర్ భావిస్తే బిల్ నుంచి ఆ అదనపు మొత్తాన్ని తొలగించాలని అక్కడి యాజమాన్యాన్ని అడగొచ్చు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కస్టమర్లు 1915 నంబర్​కు కాల్ చేసి లేదా నేషనల్ కన్జ్యూమర్ హెల్ప్​లైన్​(ఎన్​సీహెచ్​) యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓ హీరో ఇబ్బందికరంగా ప్రవర్తించారు.. : సినీ నటి ఖుష్బూ

డిసెంబర్ నుంచి స్ట్రీమింగ్ కానున్న హరికథ వెబ్ సిరీస్

ఖర్చుపెట్టినా దక్కని ఫలితంతో ఎస్కేప్ అయిన నిర్మాత

ఎస్ఎస్ థమన్ లాంచ్ చేసిన అల్లరి నరేష్, అమృత అయ్యర్ బచ్చల మల్లి మెలోడీ సాంగ్

కన్నప్ప లో మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యాబేజీతో బిర్యానీ.. పెరుగు పచ్చడితో టేస్ట్ చేస్తే.. అదిరిపోతుంది...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

తర్వాతి కథనం
Show comments